kakinada: ఐడియల్ కాలేజ్ వద్ద విద్యార్థుల ధర్నా...ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-11-12T17:52:47+05:30 IST

విద్యాసంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐడియల్ కళాశాల వద్ద శుక్రవారం విద్యార్థులు ధర్నాకు దిగారు.

kakinada: ఐడియల్ కాలేజ్ వద్ద విద్యార్థుల ధర్నా...ఉద్రిక్తం

కాకినాడ: విద్యాసంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐడియల్ కళాశాల వద్ద శుక్రవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గని పరిస్థితి నెలకొంది. కాకినాడ కలెక్టరేట్ వద్దకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ గేట్లను పోలీసులు మూసివేశారు. దీన్ని కూడా లెక్క చేయకుండా విద్యార్థులు  గేట్లను తన్నుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2021-11-12T17:52:47+05:30 IST