‘నీళ్ల’ రచ్చ!

ABN , First Publish Date - 2021-11-30T06:53:18+05:30 IST

కాకినాడ సిటీ, నవంబరు 29: జిల్లాలో రబీ సాగుకు డిసెంబరు 15 నుంచి సాగునీరు అందించాలని జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం తీర్మానించింది. ఏప్రిల్‌ 15 వరకు నీటి సరఫరా కొనసాగించాలని పేర్కొంది. అయితే ఎగువన నీటి లభ్యత తక్కువగా ఉన్నందున 74 శాతం విస్తీర్ణానికే సాగునీరు సరఫరా చేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, ఎ

‘నీళ్ల’ రచ్చ!
సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు. పక్కన మరో మంత్రి వేణు, జడ్పీ చైర్మన్‌ వేణుగోపాలరావు, కలెక్టర్‌ హరికిరణ్‌, విప్‌లు రాజా, జగ్గిరెడ్డి

డిసెంబరు 15 నుంచి ఏప్రిల్‌ 15 వరకు రబీకి సాగునీరు

నీటి లభ్యత తక్కువ ఉన్నందున 74 శాతం                         

విస్తీర్ణానికి మాత్రమే సాగునీరు ఇస్తామన్న ప్రభుత్వం

కుదరదని నిరసన వ్యక్తంచేసిన రాజప్ప, వేగుళ్ల, చిక్కాల  

బోర్ల కింద వరి సాగు వద్దని తీర్మానం చేయాలన ్న మంత్రి

తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

వెనక్కి తగ్గి ప్రతిపాదన విరమించుకున్న కన్నబాబు

సాగునీటి కోసం ఒడిశాను సంప్రదిస్తామని హామీ

కాకినాడ సిటీ, నవంబరు 29: జిల్లాలో రబీ సాగుకు డిసెంబరు 15 నుంచి సాగునీరు అందించాలని జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం తీర్మానించింది. ఏప్రిల్‌ 15 వరకు నీటి సరఫరా కొనసాగించాలని పేర్కొంది. అయితే ఎగువన నీటి లభ్యత తక్కువగా ఉన్నందున 74 శాతం విస్తీర్ణానికే సాగునీరు సరఫరా చేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మల్సీ చిక్కాల రామచంద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు. ఏ రైతు నష్టపోకుండా అందరికీ సాగునీరు ఇవ్వాలని మంత్రిని డిమాండు చేశారు. దీంతో నీటి లభ్యతను బట్టి సమస్య లేకుండా చూస్తామని కన్నబాబు హామీ ఇచ్చారు. బోర్ల కింద వరిసాగు వద్దని తీర్మానం చేయాలని మంత్రి కన్నబాబు అన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. తీర్మానం చేస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించి అమలు చేయాలన్నారు. దీంతో కన్నబాబు వెనక్కి తగ్గి ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. గోదావరి తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో రబీ 2021-22 సీజన్‌కు నీటి లభ్యత ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, సమర్థ నీటి యాజమాన్యం ద్వారా పూర్తి ఆయుకట్టుకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలని నీటి పారుదల సలహా మండలి నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.


సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ వివేకానంద సమావేశ హాలులో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కన్నబాబుతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్‌లు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ శాఖ ఉన్న తాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 2021-22 రబీ పంటలకు సాగునీరు, వేసవి తాగునీరు అవసరాలు, కాలువలు తెరవడం, మూసివేత తేదీలు తదితర అంశాలపై మండలి విస్తృతంగా సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో తొలుత ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజనీరు బి.రాంబా బు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా గోదావరిలో నీటి వనరుల లభ్యత, వివిధ వనరుల నుంచి అదనపు జలాల సమీకరణ, అందుబాటులో ఉన్న జలాలతో సాగు చేపట్టే అవకాశం ఉన్న ఆయుకట్టు విస్తీర్ణం తదితర అంశాలను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్‌లో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 4,36,553 ఎకరాలు, పశ్చిమగోదావరిలో 4,60,000 ఎకరాలు విస్తీర్ణంలో రబీ పంటకు సాగునీరు, తాగునీటి అవసరాలకు 90.22 టీఎంసీల జలాలు అవసరం కాగా, అంచనాల ప్రకారం 61.76 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని చెప్పారు. ఈ జలాలతో 74.41 శాతం ఆయుకట్టుకు నీరు సరఫరా చేసే అవకాశమే ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై జరిగిన సమీక్షలో గత అనుభవాలను దృష్టిలో ఉంచు కుని సమర్థ నీటి సరఫరా ప్రణాళిక ద్వారా పూర్తి ఆయుకట్టుకు రబీ సీజనులో సాగు నీరు అందించేందుకు కృషి చేయాలని మండలి సభ్యులు ఏకగ్రీవంగా కోరారు.


మండలి చేసిన తీర్మానాలివే..

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎదురైన అనుభవాల దృష్ట్యా రబీ నాట్లను సాధ్యమైనంత ముందుగా చేపట్టి వేసవి నీటి ఎద్దడిలోపు పంటలు పూర్తి చేసుకోవాలి. 

బొండాలు రకానికి బదులుగా 120 రోజుల్లో పంట పూర్తయ్యే 1121 రకాన్ని చేపట్టేటట్టు ఆర్‌బీకేల ద్వారా రైతులను ప్రోత్సహించాలి. 

రబీ పంటకు డిసెంబరు 15 నుంచి నీటిని విడుదలచేసి, ఏప్రిల్‌ 15-20 తేదీల  మధ్య కాలువలను మూసివేయాలని ప్రాఽథమికంగా నిర్ణయం తీసుకుని, రాష్ట్ర    స్థాయి సమావేశంలో చర్చించిన అనంతర ం తేదీలను ఖరారు చేయాలని నిర్ణయం. 

శివారు, మెరక ఆయకట్టు భూముల్లోను, బోర్ల కింద వరికి బదులు లాభసాటి     ఆదాయాలనిచ్చే ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని నిర్ణయం

రబీ సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో జిల్లా స్థాయి కంట్రోల్‌ రూం, ప్రత్యేక పర్యవేక్షక కమిటీ ఏర్పాటు నిర్ణయం


ఈ సమావేశానికి హాజరైనవారు...

ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, తోట త్రిమూర్తులు, జాయింట్‌ కలెక్టర్లు సుమిత్‌కుమార్‌, ఏ భార్గవ్‌తేజ, ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, పెండెం దొరబాబు, జక్కంపూడి రాజా, కొండేటి చిట్టిబాబు, పొన్నాడ వెంకట సతీష్‌, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, నిమ్మకాయల చినరాజప్ప, వేగళ్ల జోగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఎం.సాయిబాబు, ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టం చీఫ్‌ ఇంజనీర్‌ ఎన్‌ పుల్లారావు, పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌బాబు, ఇరిగేషన్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ బి.రాంబాబు, పోలవరం చీఫ్‌ మెయిన్‌ కెనాల్‌ సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసయాదవ్‌, పోలవరం హెడ్‌ వర్క్స్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ కె.నరసింహమూర్తి, గ్రామీణ నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాసు, కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరాజు, ఇతర ఈఈలు, డీఈలు.

Updated Date - 2021-11-30T06:53:18+05:30 IST