Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు

కాకినాడ క్రైం, డిసెంబరు 7: పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశించారు. కాకినాడ త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ను మంగళవారం ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఫైళ్లను తనిఖీ చేశారు. వివిధ కేసులపై సమీక్షించారు. సిబ్బంది సమస్యలపై ఆరా తీశారు. డీఎస్పీ వి.భీమారావు, త్రీటౌన్‌ ఎస్‌హెచ్‌వో సీహెచ్‌రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement