బలరాంనాయక్‌పై ఈసీ అనర్హత వేటు

ABN , First Publish Date - 2021-06-24T09:23:36+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై... భారత ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వేసింది. 2019 ఎన్నికలలో మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాం ఓటమి పాలయ్యారు.

బలరాంనాయక్‌పై ఈసీ అనర్హత వేటు

  • మూడేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం
  • ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకే..


హైదరాబాద్‌, జూన్‌  23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై... భారత ఎన్నికల కమిషన్‌  అనర్హత వేటు వేసింది. 2019 ఎన్నికలలో మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాం ఓటమి పాలయ్యారు. కానీ, నిర్ణీత గడువులోగా ఆయన ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించకపోవడంతో తాజాగా ఈసీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు మూడేళ్లపాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అర్హతను ఆయన కోల్పోయారు. అలాగే, అదే నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావుతోపాటు మరో నలుగురిపైనా అనర్హత వేటు వేస్తూ భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) ఆదేశానుసారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) శశాంక్‌గోయల్‌ ఇటీవల నోటిఫికేషన్‌  జారీ చేశారు. ఇదిలా ఉండగా, 2019లో మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన తాను.. ఖర్చుల వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించానని బలరాం నాయక్‌ స్పష్టం చేశారు. ఈ వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్‌కు మళ్లీ సమర్పిస్తానని, అవసరమైతే కోర్టు ద్వారా అందజేస్తానని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-24T09:23:36+05:30 IST