రోజూ ఇలా తినాలి

ABN , First Publish Date - 2021-02-06T19:11:20+05:30 IST

అనారోగ్యం దరిచేరకూడదంటే మూడు పూటలా మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

రోజూ ఇలా తినాలి

ఆంధ్రజ్యోతి(06-02-2021)

అనారోగ్యం దరిచేరకూడదంటే మూడు పూటలా మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 


అల్పాహారంలో...


బియ్యంతో చేసిన ఇడ్లీ, దోసెలకు బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ, దోసెలను వారానికి ఒకసారి తింటే మంచిది. 


దోసెలు, ఇతర అట్లు వేసుకునేటప్పుడు నూనె బదులు నెయ్యి వాడితే మంచిది.


మొలకెత్తిన గింజలను తింటే ఆరోగ్యానికి మంచిది. ఉడకబెట్టిన శనగలు, అలసందలు, వేరుశెనగలు తింటే కూడా ఎంతో మంచిది.


పూరీలు, బోండాలు వంటి వాటిని నెలకొకసారి తినడం ఉత్తమం. 


వారానికి ఒకటి లేదా రెండుసార్లు చపాతీలను నేతితో కాల్చుకుని తింటే మంచిది.


మధ్యాహ్న భోజనంలో...


ముడిబియ్యం, తృణధాన్యాలు ఆరోగ్యానికి మంచిది. జొన్న అన్నం, కొర్ర అన్నం, రాగిసంకటి లాంటివి తింటే మంచిది. వీటిల్లో ఎన్నో పోషకాహారపదార్థాలు ఉన్నాయి. 


తక్కువ నూనెతో తయారుచేసిన రకరకాల కూర లను రోజూ తినాలి.


వారంలో మూడురోజులు తప్పనిసరిగా ఆకుకూరలు తీసుకోవాలి. 


రాత్రి భోజనంలో...


ఏడు-ఎనిమిది గంటల మధ్యలో డిన్నర్‌ ముగించాలి. 


రాత్రి రెండు లేదా మూడు జొన్న రొట్టెలు లేదా చపాతీలు తింటే మంచిది. రాత్రి సమయంలో ఆహారం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి సురక్షితం.


Updated Date - 2021-02-06T19:11:20+05:30 IST