అన్నం కంటే కూరల్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.. ఎందుకుంటే?

ABN , First Publish Date - 2021-11-12T19:24:37+05:30 IST

పాంక్రియాస్‌ లేదా క్లోమగ్రంధి మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. దీనికి అవసరమైన కొన్నిరకాల ఎంజైములను, రక్తంలో గ్లూకోజును నియంత్రించే ఇన్సులిన్‌, గ్లూకగోన్‌

అన్నం కంటే కూరల్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.. ఎందుకుంటే?


ఆంధ్రజ్యోతి(12-11-2021)

ప్రశ్న: అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌ ఉన్నవారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?


- సరస్వతి, కరీంనగర్‌


డాక్టర్ సమాధానం: పాంక్రియాస్‌ లేదా క్లోమగ్రంధి మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. దీనికి అవసరమైన కొన్నిరకాల ఎంజైములను, రక్తంలో గ్లూకోజును నియంత్రించే ఇన్సులిన్‌, గ్లూకగోన్‌ లాంటి హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది. పాంక్రియాటైటిస్‌ సమస్య వచ్చినప్పుడు మన జీర్ణవ్యవస్థ పని తీరులో మార్పు వస్తుంది. అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌ ఏర్పడినప్పుడు ఆహారంలో కొవ్వు పదార్ధాలను పూర్తిగా తగ్గించాలి. వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు. స్వీట్లు, చక్కర, బెల్లం లాంటి తీపి పదార్థాలను కూడా మానెయ్యాలి. వెన్న తీసిన పాలను, వాటితో చేసిన పెరుగు మాత్రమే వాడాలి. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తప్పనిసరిగా తినాలి. కూరలు వండేప్పుడు కూడా నూనె బాగా తక్కువ వాడాలి. అన్నం కంటే కూరల్ని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.  కొవ్వు తక్కువగా ఉండే కోడి, చేప లాంటివి వారానికి ఓసారి తీసుకోవచ్చు కానీ మాంసం వద్దు. అవసరాన్ని బట్టి వైద్యుల సలహాతో పాంక్రియాటిక్‌ ఎంజైములను మాత్రలు లేదా టానిక్‌ రూపంలో ఆహారంతో పాటుగా తీసుకోవలసి ఉంటుంది. 


డాక్టర్ లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-11-12T19:24:37+05:30 IST