పన్నుల పేరుతో కాల్చుకు తింటున్నారు

ABN , First Publish Date - 2021-06-12T05:02:10+05:30 IST

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీ ఆర్‌ ప్రజలను పన్నుల పేరుతో

పన్నుల పేరుతో కాల్చుకు తింటున్నారు
ఘట్‌కేసర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎంపీ రేవంత్‌రెడ్డి

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి 


ఘట్‌కేసర్‌ : కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీ ఆర్‌ ప్రజలను పన్నుల పేరుతో కాల్చుకు తింటు న్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఏఐసీసీ పిలుపు మేరకు మేడ్చల్‌ జిల్లా ఘట్‌ కేసర్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి పక్క నున్న మైసమ్మగుట్ట సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమ ర్శిం చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నా, దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభు త్వం పెట్రోల్‌పై పన్ను రూపంలో రూ.32 వసూలు చేస్తుండగా, కేంద్రం రూ.33 వసూలు చేస్తుంద న్నారు. వంటగ్యాస్‌ ధరనూ పెంచుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. డీజిల్‌ ధర పెంచడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతు న్నాయని విమర్శించారు. పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌ వంటి పేద దేశాల్లో లీటరు పెట్రోలు రూ.60కి మించటం లేదన్నారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచి, సంపన్నులు తిరిగే విమాన చార్జీలు పెంచకపోవటం ద్వారా పేదల పట్ల వీరికున్న ప్రేమ ఏపాటిదో తేటతెల్లమౌతుంద న్నారు. 35 రోజుల్లో 22మార్లు చమురు ధరలు పెంచారని ధ్వజమెత్తారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలపై వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండ గడుతామన్నారు. అనం తరం కార్యకర్తలతో కలిసి పెట్రోల్‌ బంకు నుండి యంనంపేట్‌ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వ హించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కందికంటి శ్రీధర్‌, తోటకూర వజ్రేష్‌యాదవ్‌, వేణగోపాల్‌రెడ్డి, మేడ్చల్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, కర్రె రాజేష్‌, మల్‌రెడ్డి రాంరెడ్డి, మహేష్‌గౌడ్‌,, భాస్కర్‌రెడ్డి, నగేష్‌గౌడ్‌, అనురాధ, రాఘవరెడ్డి, శివప్రదీప్‌రెడ్డి, పాల్గొన్నారు.


అసమర్ధ విధానాలతో ప్రజలకు ఇబ్బందులు 

ఆమనగల్లు /కడ్తాల్‌/ తలకొండపల్లి :  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ విధానాల మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. కరోనా కంటే దేశా నికి కమలమే ప్రమాదకరమని ఆయన మండిప డ్డారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం ఆమనగల్లులో నిరసన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఎమ్‌.ఏ. ఖలీల్‌, మండ్లీ రాములు, కొప్పుల శేఖర్‌గౌడ్‌, కృష్ణనాయక్‌, అలీమ్‌, రాఘవేందర్‌, మహేశ్‌, ఫరీద్‌, సురేశ్‌ నాయక్‌, శ్రీకాంత్‌, ఖాదర్‌, కరీం, ఫీరోజ్‌, దళపతి, రామకృష్ణ, హరిలాల్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 


పరిగిలో..

పరిగి: పెంచిన డీజిల్‌, పెంట్రోల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పరిగిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పరిగిలోని పెట్రోల్‌ పంపును మూసివేయించారు. వాహనాన్ని తాళ్లతో లాగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ హయాంలో ఇంధనపు ధరలు తక్కువగా ఉండేవని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ వచ్చాకే ధరలు పెట్టింపయ్యా యని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లీటరు పెట్రోల్‌ రూ.60, డీజిల్‌ రూ.45, గ్యాస్‌ రూ.450, మంచినూనె రూ.60 ధరలు ఉండేవి. గనేడు అన్ని ధరలను రెట్టింపు చేశారని విమర్శించారు. ధరలు తగ్గించకపోతే కాంగ్రెస్‌ ఆఽధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు సుభాష్‌చందర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి కె.హణ్మంత్‌ముదిరాజ్‌, కొమిరె రాంచంద్రయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు జమీల్‌, పరుశరాంరెడ్డి, కృష్ణ, బి.వెంకట్‌రెడ్డి, అనెం ఆంజనేయులు, శ్రీనివాస్‌, అక్బర్‌, చిన్ననర్సింహులు, సర్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-12T05:02:10+05:30 IST