శాకాహారంతో గుండె భద్రం

ABN , First Publish Date - 2020-02-19T15:56:58+05:30 IST

శాకాహారులకు హృద్రోగాల ముప్పు చాలా తక్కువని అమెరికాలోని ట్యులేన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. మనుషుల జీర్ణకోశంలో గట్‌ బ్యాక్టీరియా ఉంటుంది. ఆహారం

శాకాహారంతో గుండె భద్రం

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 18 : శాకాహారులకు హృద్రోగాల ముప్పు చాలా తక్కువని అమెరికాలోని ట్యులేన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. మనుషుల జీర్ణకోశంలో గట్‌ బ్యాక్టీరియా ఉంటుంది. ఆహారం జీర్ణమవడం, పోషకాల శోషణ, శరీరానికి శక్తిని ఇవ్వడం, వ్యాధి నిరోధక స్పందనల్లో ‘గట్‌’ సూక్ష్మజీవులదే కీలక పాత్ర. మాంసాహారం తినేవారిలో ట్రైమీథైలమైన్‌ ఎన్‌-ఆక్సైడ్‌(టీఎంఏవో) అనే మెటబోలైట్‌ను గట్‌ బ్యాక్టీరియా విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. శరీరంలో టీఎంఏవో మోతాదు పెరిగితే హృద్రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. శాకాహారం వాడకాన్ని పెంచితే టీఎంఏవో విడుదల రేటు తగ్గి.. గుండెకు సంబంధించిన వ్యాధుల ముప్పు తగ్గుతుందని పేర్కొన్నార్చు.

Updated Date - 2020-02-19T15:56:58+05:30 IST