పది నిమిషాల్లో ఈ-ఆధార్‌

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

చిటికెలో పని అయితే ఇంకేముంది. ఎవరికైనా హాయిగానే ఉంటుంది. బ్యాంక్‌లో అకౌంట్‌ ఆరంభించడానికి నుంచి వివిధ....

పది నిమిషాల్లో ఈ-ఆధార్‌

చిటికెలో పని అయితే ఇంకేముంది. ఎవరికైనా హాయిగానే ఉంటుంది. బ్యాంక్‌లో అకౌంట్‌ ఆరంభించడానికి నుంచి వివిధ అవసరాలకు ఉండాల్సి న ప్రధాన డాక్యుమెంట్‌ ఆధార్‌. అయితే ఇప్పుడు దాన్ని వెంటపెట్టుకుని తిరగాల్సిన పనిలేదు. దీనికి డిజిటల్‌ రూపం అంటే ఈ-ఆధార్‌ను మొబైల్‌ లో పెట్టుకుని తిరగవచ్చు. అఽధికారిక వెబ్‌సైట్‌ నుంచే కేవలం పది నిమిషాల్లో ఈ-ఆధార్‌ను డౌన్‌లోడు చేసుకోవచ్చు. అందుకోసం

 మొదట అధికారిక వెబ్‌సైట్‌ https://uidai.gov.in/

హోమ్‌పేజీలో ‘డౌన్‌లోడ్‌ ఆధార్‌’ పిక్‌ చేయాలి.

ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ లేదా వర్చ్యువల్‌ ఐడీలో ఒకటి ఎంపిక చేసుకోవాలి. 

సబ్మిటింగ్‌కు ముందు కాప్చా కోడ్‌ను జాగ్రత్తగా చెక్‌ చేయాలి.

వెరిఫికేషన్‌ కోసం ఓటిపి కోడ్‌ వస్తుంది. కోడ్‌ ఎంటర్‌ చేయడంతో ట్రాన్సాక్షన్‌ పూర్తవుతుంది. 

పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం వ్యక్తి పాస్‌వర్డ్‌ అవుతుంది. 

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST