ఈబీసీ నేస్తం ద్వారా రూ.44.10 కోట్లు జమ

ABN , First Publish Date - 2022-01-26T07:23:36+05:30 IST

కాకినాడ సిటీ, జనవరి 25: జిల్లాలో ఈబీసీ నేస్తం పధకం కింద 29,406 మంది లబ్ధిదారులకు రూ. 44.10 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తూ ఆర్థికంగా మనోధైర్యం కల్పించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్‌ ఆర్‌ ఈబీసీ

ఈబీసీ నేస్తం ద్వారా రూ.44.10 కోట్లు జమ
చెక్కును విడుదల చే స్తున్న మంత్రులు, కలెక్టర్‌, ఇతర అధికారులు

మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ సిటీ, జనవరి 25: జిల్లాలో ఈబీసీ నేస్తం పధకం కింద 29,406 మంది లబ్ధిదారులకు రూ. 44.10 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తూ ఆర్థికంగా మనోధైర్యం కల్పించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్‌ ఆర్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 3,92,674 మందికి రూ.589.01 కోట్లు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ వివేకానంద హాల్‌ నుంచి మంత్రి కన్నబాబు, కలెక్టర్‌ సి.హరికిరణ్‌, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆవాల రాజేశ్వరి, జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌తేజ్‌, కాకినాడ నగర మేయర్‌ సుంకర శివప్రసన్న, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ అల్లి రాజబాబు, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకునే క్రమం లో దేశంలో ఎక్కడా లేనివిధంగా వారి అవసరాలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఆదుకుంటున్నారన్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి లబ్ధిదారులకు ఉండేదని, ప్రస్తుతం వలంటీర్లు ఇళ్లకు వచ్చి అర్హులను గుర్తించి పథకం ప్రయోజనాలను అందిస్తుందన్నారు. కలెక్టర్‌ ఈ పథకం ద్వారా రానున్న మూడు సంవత్సరాల్లో రూ. 15 వేల చొప్పున రూ. 45 వేల ఆర్థిక సహాయం చేసేందుకు జిల్లాలో అర్హులను పూర్తి పారదర్శకంగా ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా రూ. 44.10 కోట్ల విలువ గల చెక్కును లబిఽ్ధదారులకు అందజేశారు. 

Updated Date - 2022-01-26T07:23:36+05:30 IST