టీఎంసీ ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరించిన ఈసీ.. కోర్టు ఏమందంటే..?

ABN , First Publish Date - 2021-03-11T22:01:31+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 15న ప్రారంభం కానున్న పోలింగ్, మొత్తంగా ఎనిమిది విడతల్లో జరగనుంది. మే 2న ఈ ఎన్నికల ఫలితాలు వెలుడనున్నాయి. కాగా, రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా

టీఎంసీ ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరించిన ఈసీ.. కోర్టు ఏమందంటే..?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని జోయ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే ఉజ్వల్ కుమార్ వేసిన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. అయితే దీనిని కోల్‌కతా హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఉజ్వల్ కుమార్‌ను ఎన్నికల్లో పోటీకి అనుమతి ఇచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉజ్వల్ కుమార్ కోల్‌కతా హైకోర్టును గురువారం ఆశ్రయించారు. కాగా ఈసీ తిరస్కరణ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 15న ప్రారంభం కానున్న పోలింగ్, మొత్తంగా ఎనిమిది విడతల్లో జరగనుంది. మే 2న ఈ ఎన్నికల ఫలితాలు వెలుడనున్నాయి. కాగా, రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నువ్వా నేనా అన్న తీరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎలాగైనా బెంగాల్‌ అసెంబ్లీపై తమ జెండా ఎగరవేయాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. కాగా తమ అధికారాన్ని కాపాడుకోవడానికి టీఎంసీ సర్వ శక్తులూ ఒడ్డుతోంది.

Updated Date - 2021-03-11T22:01:31+05:30 IST