అస్సాం సీఎంకు ఎన్నికల సంఘం వార్నింగ్

ABN , First Publish Date - 2021-10-27T22:29:23+05:30 IST

రోడ్లు, మెడికల్ కాలేజీలు, పాఠశాలలు, స్టేడియంలు నిర్మిస్తామంటూ సీఎం హిమంత్ బిశ్వా శర్మ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం ఓటర్లను తప్పుదారి పట్టించడమని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి..

అస్సాం సీఎంకు ఎన్నికల సంఘం వార్నింగ్

గువహాటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మకి ఎన్నికల సంఘం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం బిశ్వా శర్మ అభివృద్ధి పనులను ప్రకటిస్తూ ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అస్సాం ప్రతిపక్ష నేత దేబబ్రాత సైకియా, అస్సాం కాంగ్రెస్ అధినేత భూపెన్ కుమార్ బోరాహ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం స్పందిస్తూ సీఎంకు వర్నింగ్ ఇచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు అనుగుణంగా నడుచుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.


రోడ్లు, మెడికల్ కాలేజీలు, పాఠశాలలు, స్టేడియంలు నిర్మిస్తామంటూ సీఎం హిమంత్ బిశ్వా శర్మ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం ఓటర్లను తప్పుదారి పట్టించడమని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కాగా ఇదే విషయమై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. దీనిపై ఎన్నికల సంఘం కఠినంగా స్పందిచడంతో ముఖ్యమంత్రి బిశ్వా శర్మ క్షమాపణలు తెలియజేశారు. అయితే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఎన్నికల నియామళిని అతిక్రమించి ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ కోరుతున్నట్లు, అయితే ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినట్లు తాను ఎలాంటి ప్రకటనలు చేయలేదని ఈసీకి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2021-10-27T22:29:23+05:30 IST