ఈ-కామర్స్‌ ఆటో సర్వీసులపై 5% జీఎస్‌‌టీ

ABN , First Publish Date - 2021-11-27T06:11:45+05:30 IST

దేశంలో ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అందించే ఆటో రిక్షా సర్వీసులపై 5 శాతం జీఎ్‌సటీని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది....

ఈ-కామర్స్‌ ఆటో సర్వీసులపై 5% జీఎస్‌‌టీ

న్యూఢిల్లీ: దేశంలో ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అందించే ఆటో రిక్షా సర్వీసులపై 5 శాతం జీఎ్‌సటీని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న రెవెన్యూ శాఖ.. ఈ-కామర్స్‌ వేదికల ద్వారా అందించే ప్రయాణికుల రవాణా సర్వీసులపై జీఎ్‌సటీ మినహాయింపును ఉపసంహరిస్తూ నవంబరు 18వ తేదీతో ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఆఫ్‌లైన్‌ విధానంలో లేదా మాన్యువల్‌ విధానంలో అందించే ఆటో సర్వీసులపై మాత్రం మినహాయింపు యథాతథంగా కొనసాగుతుంది. ఈ చర్య వల్ల ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఆటో సర్వీసులు అందించే ఈ-కామర్స్‌ కంపెనీలపై ప్రత్యక్ష భారం పడుతుంది. మార్కెట్లో ఈ-కామర్స్‌ పరిశ్రమ కీలక భాగస్వామి కావడంతో పలు కంపెనీలు ప్రయాణికులకు రవాణా సేవలందిస్తున్నాయి.

Updated Date - 2021-11-27T06:11:45+05:30 IST