రష్యా కంటే చైనాయే మాకు పెద్ద సవాలు: అమెరికా

ABN , First Publish Date - 2020-08-14T04:15:02+05:30 IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా ప్రభావం అధికంగా ఉందని ఈ కారణంగా రష్యా కంటే చైనాయే తమకు పెద్ద సవాలు అని అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో వ్యాఖ్యానించారు.

రష్యా కంటే చైనాయే మాకు పెద్ద సవాలు: అమెరికా

వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా ప్రభావం అధికంగా ఉందని, ఈ కారణంగా రష్యా కంటే చైనాయే తమకు పెద్ద సవాలు విసురుతోందని అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. జెక్ రిపబ్లిక్ చట్టసభలో బుధవారం నాడు ప్రసంగించిన ఆయన.. ఆర్థికశక్తితో చైనా ఇతర దేశాలపై అనేక రకాల ఒత్తిళ్లు తెస్తోందని ఆరోపించారు. సోవిట్ యూనియన్‌‌ కూడా చేయని విధంగా చైనా అనేక దేశాలతో ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలతో పెనవేసుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కారణంగా రష్యా కంటే చైనాయే తమకు పెద్ద సవాలు విసురుతోందని తెలిపారు. రష్యాపై కూడా మైక్ పాంపియో మండిపడ్డారు. జెక్ రిపబ్లిక్ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జెక్‌ దేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచార వ్యాప్తి, ఆ దేశంపై సైబర్ దాడులకు దిగడం వంటి అనైతిక చర్యలకు రష్యా పూనుకుంటోందని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2020-08-14T04:15:02+05:30 IST