Abn logo
Nov 20 2020 @ 01:26AM

మరో ఐదేళ్లు తిప్పలే!

Kaakateeya

ముంబై: కరోనా కష్టాలు సద్దుమణిగినా మరో ఐదేళ్ల పాటు భారత ఆర్థిక వ్యవస్థకు తిప్పలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌ఎ్‌సబీపీ హోల్డింగ్స్‌ తెలిపింది. వచ్చే ఐదేళ్లలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏటా సగటున 4.5 శాతానికి మించి ఉండక పోవచ్చని అంచనా వేసింది. కోవిడ్‌కు ముందు ఇది 6.5 శాతంగా ఉంది. కంపెనీల అప్పుల భారం, బ్యాంకుల ఎన్‌పీఏలు, ఎన్‌బీఎ్‌ఫసీల ఆర్థిక కష్టాల కరోనా కష్టాలు సద్దుమణిగినా మరో ఐదేళ్ల పాటు భారత ఆర్థిక వ్యవస్థకు తిప్పలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌ఎ్‌సబీపీ హోల్డింగ్స్‌ తెలిపింది.


వచ్చే ఐదేళ్లలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏటా ను ఇందుకు కారణంగా తెలిపింది. కార్మిక చట్టాల్లో అవసరమైన సంస్కరణలు లేకపోవడం కూడా  లోపమేనని పేర్కొంది. ఇదిలా ఉండగా ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ సంస్థ కూడా 2020-25 సంవత్సరాల మధ్య భారత జీడీపీ సగటు వృద్ధి రేటు 4.5 శాతం మించదని గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. కరోనా అనంతర కాలంలో కూడా భారత్‌ దారుణంగా దెబ్బ తిన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని అంచనా వేసింది. 


గాడిన పడుతోంది: ఇక్రా

ఉత్పత్తి, నిర్మాణ రంగాల ఊతంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. దీంతో సెప్టెంబరు, 2020తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు పతనం తొలి త్రైమాసికంలో ఉన్నంత  తీవ్రంగా ఉండదని దేశీయ రేటింగ్‌ సంస్థ ‘ఇక్రా’ తన తాజా నివేదికలో పేర్కొంది. కోవిడ్‌, లాక్‌డౌన్‌ల కారణంగా జూన్‌, 2020తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారత జీడీపీ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23.9 శాతం పడిపోయింది. సెప్టెంబరు  త్రైమాసికంలో ఈ తగ్గుదల మైనస్‌ 9.5 శాతానికి మించక పోవచ్చునంటోంది. 

లాక్‌డౌన్‌లు తొలగించడంతో జూలై నుంచి దేశంలో ఆర్థిక కార్యక్రమాలు తిరిగి కొంతమేర ప్రారంభం అయ్యాయి. లేకపోతే వృద్ధి రేటు మరింత పడిపోయేదని ఇక్రా అంచనా. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎ్‌సఓ) రెండో త్రైమాసిక జీడీపీ అంచనాలను ఈ నెల 27న విడుదల చేయనుంది. తొలి త్రైమాసికంలో 22.8 శాతంగా ఉన్న స్థూల విలువ జోడింపు (జీవీఏ) ఆధారిత జీడీపీ వృద్ధి రేటు పతనం కూడా రెండో త్రైమాసికంలో 8.5 శాతానికి తగ్గుతుందని ఇక్రా అంచనా. 


వేగంగానే వృద్ధి బాట : బార్క్‌లేస్‌

కోవిడ్‌ ముప్పు తగ్గితే భారత జీడీపీ వృద్ధి రేటు వేగంగానే పుంజుకుంటుందని మరో అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ బార్క్‌లేస్‌ అంచనా వేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2021-2022 ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు 8.5 శాతం వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సంస్థ ఇంతకు ముందు ప్రకటించిన అంచనా కంటే ఇది ఒకటిన్నర శాతం ఎక్కువ. 


ఉద్దీపన ప్యాకేజీతో ఊతం : మూడీస్‌

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) జీడీపీ వృద్ధి రేటు పతనాన్ని కొంతమేర అడ్డుకోనుంది. దీంతో ఉత్పత్తి రంగం పుంజుకుని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తెలిపింది. ఈ కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు పతనం అంచనాలను మైనస్‌ 11.5 శాతం నుంచి 10.6 శాతానికి కుదించింది. ప్రభుత్వ తాజా ఉద్దీపన ప్యాకేజీలతో ఈ అంచనాలను సవరిస్తున్నట్టు పేర్కొంది.

Advertisement
Advertisement