పాత పద్ధతిలోనే ఈ-క్రాప్‌ బుకింగ్‌: ఏడీఏ

ABN , First Publish Date - 2021-07-25T05:20:15+05:30 IST

సాంకేతిక సమస్యలతో పాత పద్ధతిలోనే ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ మనోహర్‌ తెలిపారు.

పాత పద్ధతిలోనే ఈ-క్రాప్‌ బుకింగ్‌: ఏడీఏ
ఏడీఏ మనోహర్‌

శ్రీకాళహస్తి, జూలై 24: సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు మనోహర్‌ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ఈకేవైసీ తీసుకున్న తర్వాతే ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తడంతో ఈ ప్రక్రియ నత్తనడకన నడుస్తోందని గుర్తుచేశారు. స్పందించిన వ్యవసాయ శాఖ కమిషనరు ఈకేవైసీ విధానం వద్దని ఆదేశించినట్లు గుర్తుచేశారు. ఆ మేరకు.. రైతులు సాగుచేసిన పంటల వివరాలను రైతు భరోసాకేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఆయా పంట దిగుబడులను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. 

Updated Date - 2021-07-25T05:20:15+05:30 IST