Abn logo
Sep 25 2021 @ 07:17AM

Maharashtra: మనీలాండరింగ్ కేసులో మంత్రికి ఈడీ సమన్లు

ముంబై: మహారాష్ట్రలో మనీలాండరింగ్ కేసులో మరో మంత్రికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. శివసేన పార్టీకి చెందిన మహారాష్ట్ర రవాణశాఖ మంత్రి అనిల్ పరాబ్‌ను ఈడీ ఈ నెల 28వతేదీన ప్రశ్నించనుంది.మంత్రి అనిల్ పరాబ్‌ కు ఆగస్టు 31వతేదీన సమన్లు జారీ చేసినా మంత్రి బిజీ ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది. హోంశాఖలో జరిపిన బదిలీల్లో మంత్రులు అనిల్ పరాబ్, అనిల్ దేశ్ ముఖ్ లు 10మంది డీసీపీల నుంచి రూ.20కోట్లు తీసుకున్నారని డిస్మిస్ అయిన ఇన్ స్పెక్టరు సచిన్ వాజే ఆరోపించిన నేపథ్యంలో ఈడీ ఆయన్ను విచారించనుంది.బ్లాక్ లిస్టులో ఉన్న 50 మంది బీఎంసీ కాంట్రాక్టర్ల నుంచి మంత్రి అనిల్ పరాబ్ రూ.2కోట్ల చొప్పున అడిగాడని సచిన్ వాజే ఆరోపించారు. ఆర్టీవోల బదిలీల్లో మంత్రి అనిల్ పరాబ్ అవినీతికి పాల్పడ్డాడని వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారించనుంది.

ఇవి కూడా చదవండిImage Caption