ఆ దుకాణాలు మూసివేయండి

ABN , First Publish Date - 2022-01-20T13:45:18+05:30 IST

కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చేంత వరకు టాస్మాక్‌ మద్యం దుకాణాలు మూసి వేయాలని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో,

ఆ దుకాణాలు మూసివేయండి

                                 - ఎడప్పాడి డిమాండ్‌


పెరంబూర్‌(చెన్నై): కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చేంత వరకు టాస్మాక్‌ మద్యం దుకాణాలు మూసి వేయాలని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఈ విషయమై అన్నాడీఎంకే పలుమార్లు హెచ్చరించినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అదే సమయంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉందని ప్రభుత్వం ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాజాగా, సెలవులకు వెళ్లిన వారు తిరిగి వస్తుండడంతో కేసులు భారీగా పెరిగే అవకాశ ముందని స్వయానా ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొంటున్నారని, ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజువారీ కరోనా బాధితుల సంఖ్య 24 వేలు దాటగా, వాస్తవంగా 50 వేలకు పైగానే ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారని తెలిపారు. గత అన్నాడీఎంకే హయాంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో, ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాలిన్‌ టాస్మాక్‌ దుకాణాలు మూసి వేయాలని డిమాండ్‌ చేయడంతో పాటు, తమ ఇళ్ల ముందు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం కేసులు వేగంగా పెరుగుతున్నా టాస్మాక్‌ దుకాణాల మూసివేసే ఆలోచన డీఎంకే ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలు ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, మద్యం దుకాణాలు, బార్లు తెరచి తమ ఖజానా నింపుకోవాలని చూస్తోందని ఎడప్పాడి విమర్శించారు.

Updated Date - 2022-01-20T13:45:18+05:30 IST