సాగునీరు అందించాలని మంత్రి హరీష్‌రావును కలిసిన ఎడ్‌బిడ్‌ రైతులు

ABN , First Publish Date - 2021-04-11T06:11:56+05:30 IST

నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం ఎడ్‌ బిడ్‌ గ్రామాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు 28 ప్యాకేజీలో తమ చేర్చాలని ఎడ్‌బిడ్‌ రైతులు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావును కలిసి విన్న వించారు.

సాగునీరు అందించాలని మంత్రి హరీష్‌రావును కలిసిన ఎడ్‌బిడ్‌ రైతులు
మంత్రి హరీష్‌రావుకు వినతిపత్రాన్ని అందజేస్తున్న ఎడ్‌బిడ్‌ రైతులు

ముథోల్‌, ఏప్రిల్‌ 10 : నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం ఎడ్‌ బిడ్‌ గ్రామాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు 28 ప్యాకేజీలో తమ  చేర్చాలని ఎడ్‌బిడ్‌ రైతులు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావును కలిసి విన్న వించారు. శనివారం సిద్ధిపేటలో మంత్రిని కలిసి తమ గ్రామానికి సాగునీరు అందించి తమను ఆదుకోవాలని రైతులు విన్న వించారు. 28 ప్యాకేజీలో తమ గ్రామాన్ని చేర్చినట్లయితే పంట పొలాలు సస్యశ్యామలంగా పండుతాయని పేర్కొన్నారు. ఈ సం దర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రైతులు తెలి పారు. మంత్రిని కలిసిన వారిలో రైతులు గంగారెడ్డి, సంతోష్‌రెడ్డి, నితీష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-04-11T06:11:56+05:30 IST