జిల్లాలో ఇ - డాక్టర్స్‌ లాగిన్‌

ABN , First Publish Date - 2020-05-28T09:55:54+05:30 IST

వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) సహకారంతో జిల్లాలోని

జిల్లాలో ఇ - డాక్టర్స్‌ లాగిన్‌

టెలీ కన్సల్టేషన్‌ ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి


వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) సహకారంతో జిల్లాలోని గ్రామీణ ప్రజలకు టెలీమెడిసిన్‌ సేవలు అందించనున్నట్లు చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రజలకు టెలీ మెడిసిన్‌ సేవలు అందించే టీ కన్సల్ట్‌ ప్రాజెక్టును ఆయన బుధవారం అధికారికంగా ప్రారంభించారు. మొదటి దశలో జిల్లాలోని ఒక మండలంలోని అన్ని గ్రామాల్లో టీ కన్సల్ట్‌ ప్రాజెక్టు సేవలు అందిస్తామన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలకు టెలీమెడిసిన్‌ సదుపాయం కల్పించే సౌకర్యాలు ఉంటాయని ఆయన చెప్పారు. 


టీటా తన డిజిటన్‌ ఆన్‌లైన్‌ క్లినిక్‌ ద్వారా ఇటీవల కోవిడ్‌ -19లో ఇటలీ, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, ఇతర ప్రదేశాల్లో చిక్కుకున్న ఎన్‌ఆర్‌ఐల కోసం టెలీ కన్సల్టేషన్‌ సదుపాయం నిర్వహించిదని చెప్పారు. ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటా అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ మక్తాలా, రాజేందర్‌ షెరీ, వివేక్‌ చింతలగట్టు, వివేక్‌ బొడ్డం పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T09:55:54+05:30 IST