విద్యాశాఖ వింత మెసేజ్‌లు, విచిత్ర సర్క్యులర్లు.. ఉపాధ్యాయులు టాయిలెట్స్ కడగడమేంటి?

ABN , First Publish Date - 2021-11-18T16:16:55+05:30 IST

విద్యాశాఖ వింత మెసేజ్‌లు, విచిత్ర సర్క్యులర్లు విమర్శలపాలవుతున్నాయి. రేపు ప్రపంచ టాయిలెట్ల డే నిర్వహించాలని...

విద్యాశాఖ వింత మెసేజ్‌లు, విచిత్ర సర్క్యులర్లు.. ఉపాధ్యాయులు టాయిలెట్స్ కడగడమేంటి?

అమరావతి : విద్యాశాఖ వింత మెసేజ్‌లు, విచిత్ర సర్క్యులర్లు విమర్శలపాలవుతున్నాయి. రేపు ప్రపంచ టాయిలెట్ల డే నిర్వహించాలని... పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. టీచర్లు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు టాయిలెట్స్‌ కడగాలని ఆదేశాలిచ్చింది. టాయిలెట్స్‌ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు టాయ్‌లెట్స్ కడగడమేంటని ఉపాధ్యాయసంఘాలు, పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ సర్క్యులర్‌ ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్‌ నేత పాండురంగ ప్రసాద్‌ డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-11-18T16:16:55+05:30 IST