అమెరికా వర్సిటీలతో విద్యా భాగస్వామ్యం

ABN , First Publish Date - 2021-04-13T11:01:42+05:30 IST

అమెరికా వర్సిటీలతో భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ప్రపంచమంతా ఆన్‌లైన్‌ చదువుల దిశగా వెళ్తున్న తరుణంలో ఇరు దేశాల విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం పెరగాల ని భారత్‌ భావిస్తోంది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్‌ సింగ్‌ సంధూ.. అరిజోనా స్టేట్‌ వర్సిటీ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, సౌత్‌ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, నార్త్‌ కరోలినా వర్సిటీలతో చర్చలు జరుపుతున్నారు.

అమెరికా వర్సిటీలతో విద్యా భాగస్వామ్యం

  • ఆన్‌లైన్‌ పాఠాలు, ఉమ్మడి పరిశోధనలకు భారత్‌ చొరవ

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 12: అమెరికా వర్సిటీలతో భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ప్రపంచమంతా ఆన్‌లైన్‌ చదువుల దిశగా వెళ్తున్న తరుణంలో ఇరు దేశాల విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం పెరగాల ని భారత్‌ భావిస్తోంది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్‌ సింగ్‌ సంధూ.. అరిజోనా స్టేట్‌ వర్సిటీ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, సౌత్‌ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, నార్త్‌ కరోలినా వర్సిటీలతో చర్చలు జరుపుతున్నారు. అరిజోనా విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ పాఠాలను మెరుగు పరచడం, ఉమ్మడి పరిశోధన, విజ్ఞాన భాగస్వామ్యం అంశాలపై భారతీయ విద్యాసంస్థలతో కలిసి పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

Updated Date - 2021-04-13T11:01:42+05:30 IST