Abn logo
Jul 29 2021 @ 23:09PM

జిల్లాలో 96,403 మందికి విద్యా దీవెన

విద్యార్థులకు చెక్‌ అందిస్తున్న కలెక్టర్‌, మేయర్‌

జిల్లా కలెక్టర్‌ ఎ.మల్జికార్జున

విశాఖపట్నం, జూలై 29 : జిల్లాలో 96,403 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు జగనన్న విద్యా దీవెన కింద 59.95 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. విద్యాదీవెన రెండో విడత నిధుల విడుదల సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, జేడీ రమణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాకు సంబంధించిన చెక్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందజేశారు.