Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యాసంస్థల మూత వదంతులే

రంగారెడ్డి అర్బన్‌/హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): కరోనా థర్డ్‌వేవ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో మళ్లీ పాఠశాలలు మూతపడనునున్నాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మారుతున్న సమాజ పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. 

Advertisement
Advertisement