Abn logo
Aug 13 2020 @ 16:35PM

మరో బోల్డ్ పాత్రలో ఈషా?

అత్యంత బోల్డ్‌గా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకు ప్రస్తుతం విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఆయా బోల్డ్ పాత్రల్లో నటించే హీరోయిన్లు ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. దీంతో వెబ్ సిరీస్‌లు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. 


హిందీలో సంచలన విజయం సాధించిన `లస్ట్ స్టోరీస్` తెలుగు వెర్షన్‌లో ఈషా ఓ బోల్డ్ పాత్ర చేస్తోంది. ఈ పాత్ర తనకు చాలా మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఈషా బలంగా నమ్ముతోంది. ఇది విడుదలవకముందే మరో బోల్డ్ పాత్రకు ఈషా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ సంపత్ నంది ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ నైట్ లైఫ్ ఆధారంగా బోల్డ్‌గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోందట. ఇందులో కీలక పాత్ర చేసేందుకు ఈషాను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. 


Advertisement
Advertisement
Advertisement