Jun 11 2021 @ 09:30AM

లాక్‌డౌన్ టైమ్‌లో ఈషారెబ్బా ఏం చేసిందంటే..?

కొవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో సినీ ప‌రిశ్ర‌మ మ‌రోసారి షూటింగ్‌ల‌కు దూర‌మైంది. దీంతో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అయితే ఇంట్లోనే ఉన్నా కూడా తానేం ఖాళీగా లేనని అంటోంది హీరోయిన్ ఈషారెబ్బా. ‘‘ఓ మ‌లయాళ సినిమా కోసం విలువిద్య‌, రైఫిల్ షూటింగ్‌ల‌లో శిక్ష‌ణ తీసుకున్నాను. షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని అనుకుంటున్న త‌రుణంలో లాక్‌డౌన్‌ను విధించారు. దొరికిన ఈ స‌మ‌యాన్ని ఫిట్‌నెస్ మెరుగు కోసం ఉప‌యోగించుకోవాల‌ని అనుకున్నాను. అందుకోసం కిక్ బాక్సింగ్‌ను నేర్చుకున్నాను. కిక్ బాక్సింగ్ వ‌ల్ల మ‌నిషి శారీర‌కంగానే కాదు, మాన‌సికంగానూ దృఢంగా త‌యార‌వుతాడు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది’’  అని చెప్పుకొచ్చింది ఈషారెబ్బా.