నిధులు కేంద్రానివి.. ఫొటోలు కేసీఆర్‌వి: ఈటల రాజేందర్

ABN , First Publish Date - 2021-11-18T03:20:48+05:30 IST

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఓ ప్రకటనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సెంటిమెంట్ మీద ఓట్లు అడిగే ..

నిధులు కేంద్రానివి.. ఫొటోలు కేసీఆర్‌వి: ఈటల రాజేందర్

మంచిర్యాల: వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఓ ప్రకటనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సెంటిమెంట్ మీద ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. నిధులు కేంద్రానివి.. ఫొటోలు కేసీఆర్‌వినని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి రాష్ట్రంలో లేదని విమర్శించారు. 


‘‘పథకాలు, ప్రలోభాలకు గురి చేసినా కూడా హుజురాబాద్ ప్రజలు నన్ను అక్కున చేర్చుకున్నారు. నా గెలుపుతో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ రూ. 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోయారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.  నేతలుగా ఎదిగే వారికి హుజురాబాద్ ఒక ప్రయోగశాలగా మారింది.’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-18T03:20:48+05:30 IST