మార్కెట్ కమిటీలు మూతే..!

ABN , First Publish Date - 2020-09-19T15:14:43+05:30 IST

వ్యవసాయ పంట ఉత్పత్తులపై మార్కెట్‌ ఫీజు వసూళ్లతో ఆయా నియోజకవర్గాల పరిధిలోని వ్యవసా య మార్కెట్‌ కమిటీలు మనుగడ సాగించేవి. అయితే కేంద్రం రైతులకు మేలు చేసేలా ప్రవేశపెట్టిన ప్రత్యక్ష కొనుగోళ్ల విధానంతో మార్కెట్‌ కమిటీల మనుగడ ప్రశ్నార్థకమైంది.

మార్కెట్ కమిటీలు మూతే..!

ప్రత్యక్ష కొనుగోళ్లతో పరిస్థితి దయనీయం

చెక్‌పోస్టులపై ఆధారపడిన కమిటీలకు ఆర్థిక కష్టాలే..

గుంటూరు ఏఎంసీకి ఆదాయంలో రూ.30 కోట్ల మేర లోటు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పంట ఉత్పత్తులపై మార్కెట్‌ ఫీజు వసూళ్లతో ఆయా నియోజకవర్గాల పరిధిలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు మనుగడ   సాగించేవి. అయితే కేంద్రం రైతులకు మేలు చేసేలా ప్రవేశపెట్టిన ప్రత్యక్ష కొనుగోళ్ల విధానంతో మార్కెట్‌ కమిటీల మనుగడ ప్రశ్నార్థకమైంది.  రైతు లు, బ్రోకర్ల వద్ద కొనుగోలు చేసే ఎలాం టి పంట ఉత్పత్తుల పైనా మార్కెట్‌ ఫీజు వసూలు చేయడానికి వీలు లేదు. దీంతో కేవలం మార్కెట్‌ ఫీజుల వసూళ్లపై ఆధారపడిన మార్కెట్‌ కమి టీలు    మూత పడనున్నాయి. అలానే మార్కెట్‌ కమిటీల పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాల మాదిరిగా మారిపోతాయి. 


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యక్ష కొనుగోళ్ల (డైరెక్టు పర్చేజింగ్‌) విధానంతో జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు మూ తవేసే పరిస్థితి ఏర్పడింది.   లైసెన్స్‌డ్‌ కమీషన్‌ ఏజెంట్‌ ద్వారా కాకుండా రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేసే పంట ఉత్పత్తులపై ఎలాంటి మార్కెట్‌ ఫీజు వసూలు చేయరాదన్న నిబంధన ఆయా కమిటీలకు ఉరితాడుగా మారింది. మార్కెట్‌ కమి టీలలోకి సరుకు వచ్చే వాటికే కొద్దో గొప్పో ఆదా యం వస్తుంది తప్ప మిగిలిన వాటికి ఎలాంటి ఆదాయం రాదు. దీంతో ఆయా కమిటీలు సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేవు. అలానే మార్కెట్‌ కమిటీల పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాల మాదిరిగా మారిపోతాయి. దీంతో సిబ్బంది డిప్యూటేషన్లపై రెగ్యులేటెడ్‌ మార్కెట్‌ లకు వెళుతున్నారు. జిల్లాలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక వ్యవ సాయ మార్కెట్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిం ది. వీటిల్లో ప్రధాన మైనవిగా గుంటూరు, దుగ్గి రాల గుర్తింపు పొందాయి. తెనాలి కమిటీకి కొన్ని పంట ఉత్పత్తులు వస్తాయి. మిగతా కమిటీలన్నీ గతంలో చెక్‌పోస్టుల వద్ద వసూ లు చేసే మార్కెట్‌ ఫీజుపై ఆధారపడి కొన సాగేవి. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుకు ప్రయోజనం చేకూరుతుందన్న ఆలోచనతో ప్రత్యక్ష కొనుగోళ్ల విధానాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల లైసెన్సుడు ఏజెంట్ల ద్వారా కాకుం డా రైతులు, బ్రోకర్ల వద్ద కొనుగోలు చేసే ఎ లాంటి పంట ఉత్పత్తులపైనా మార్కెట్‌ ఫీజు వసూలు చేయడానికి లేదు. దీంతో ఎగుమతి దారులు ఆదిశగా ట్రేడింగ్‌ కొనసాగిస్తోన్నారు. 


కమీషన్‌ ఏజెంట్ల వ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకం

గుంటూరు ఏఎంసీలో సుమారు 650 మం ది కమీషన్‌ ఏజెంట్‌లు ఉన్నారు. గతంలో వీరి వద్దకు రైతులు మిర్చిని తీసుకొచ్చేవారు. వారి నుంచి ఎగుమతిదారులు కొనుగోలు చేసే వా రు. ఇందుకుగాను ఒక శాతం మా ర్కెట్‌ ఫీజు కమిటీకి వచ్చేది. మిర్చి, పత్తి, అపరాలు, చింత పండు వంటి ఉత్పత్తుల ద్వారా జీఏఎంసీకి ఏటా రూ.74 కోట్ల ఆదాయం సమకూరేది. అలాంటిది ఒక్క మిర్చి ద్వారానే నేడు రూ.10 కోట్ల లోటు కనిపి స్తోన్నది. పత్తి, అపరాలు వంటివి యార్డు వెలుపలే ట్రేడింగ్‌ జరు గుతాయి. దీంతో వాటి ద్వారా వచ్చే ఆదాయా న్ని కమి టీ కోల్పోవాల్సి వచ్చింది. ఈ విధంగా రూ. 30 కోట్ల మేరకు జీఏఎంసీ నష్ట పోయే పరిస్థితి ఉత్పన్నం అయింది. ఈ విధానంతో కమీషన్‌ ఏజెంట్ల వ్య వస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తద్వారా లైసెన్సుల రూపంలో వచ్చే ఆదాయం కూడా నిలిచిపోతుంది. గతంలో మార్కెట్‌ కమిటీల పాలక వర్గాల్లో చోటు కోసం విపరీతమైన డిమాండ్‌ ఏ పార్టీ అధి కారంలో ఉంటే ఆ పార్టీ వర్గాల్లో ఉండేది. నేడు ఆ పదవులు నామ్‌ కే వాస్తేగా మారిపో యాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ కమిటీలకు ఆదాయం సమకూరే నిర్ణయాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే కమిటీల ప్రాంగణాలు నిరుపయోగం గా మారిపోయి పాడుబడిన ప్రదేశాలుగా అయిపోతాయని చెబుతున్నారు. 

Updated Date - 2020-09-19T15:14:43+05:30 IST