ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీకి కృషి

ABN , First Publish Date - 2020-02-23T06:30:39+05:30 IST

ఇల్లు లేని పేదలకు ఉగాదికి స్థలాల పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీకి కృషి

రాష్ట్రంలో జిల్లాలోనే అత్యధిక అర్హులు 

భూసేకరణపై గందగోళం తగదు

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి


సర్పవరం జంక్షన్‌ (కాకినాడ),ఫిబ్రవరి 22: ఇల్లు లేని పేదలకు ఉగాదికి స్థలాల పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో అర్హులు మన జిల్లాలోనే ఉన్నారని, వారికి భూ మిని సేకరిస్తున్నామని దీనిపై ఎటువంటి గందరగోళం సృష్టించడం తగదని ఆయన పేర్కొన్నా రు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి సుమారు 3.50 లక్షల మందిని గుర్తించామన్నారు. సుమారు 7,700 ఎకరాల భూమి అవసరం కాగా 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, మరో 500 ఎకరాలను ప్రైవేట్‌గా సేకరిస్తున్నట్టు తెలిపారు. అమలాపు రం, రామచంద్రపురం, కాకినాడ, రాజమహేంద్రవరం డివిజన్లలో భూముల ఖరీదుగా ఉన్నాయన్నారు. పోర్టు, ఇరిగేషన్‌ భూములను తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాజమహేంద్రవరంలోని హార్టికల్చర్‌లో సాగవుతున్న ఆయిల్‌ ఫామ్‌లోని ఓపెన్‌ స్థలాన్ని కాలనీగా అభివృద్ధి చేసేందుకు స్థల సేకరణ చేశామన్నారు. బొమ్మూరు పాలిటెక్నిక్‌ కాలేజీ స్థలాన్ని 2017లోనే అప్పటి కలెక్టర్‌ తీసుకోవచ్చని, కాలేజీ భవిష్యత్తు అవసరాలు ఏమీలేదవని చెప్పడంతో స్థల సేకరణ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.


సుమార 20 ఎకరాల విస్తీర్ణంలో తెలుగు యూనివర్సిటీ ఉందని, ఇందులో కేవలం 10 మంది విద్యార్థులు చదువున్నారని, 14 మంది సిబ్బంది పని చేస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాలకు ఐదెకరాలు సరిపోతుందని, పక్కనే ఉన్న నన్న య యూనివర్సిటీలో ఈ ఐదెకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. సాల్ట్‌ డిపార్టుమెంట్‌ కు చెందిన 64 ఎకరాల మిగులు భూమిని ఇవ్వడానికి ఆశాఖ అధికారులు అంగీకరించారని, సర్వే చేయించి నిర్ధారిస్తామని కలెక్టర్‌ చెప్పారు. అవసరమైతే తప్పా అసైన్డు, ఎండోమెంట్‌ భూముల జోలికెళ్లవద్దని ఆదేశాలున్నాయని తెలిపారు. భూ ములు నిరుపయోగంగా ఉన్నాయని, భూసేకరణకు ట్రస్టీలు ముందుకొస్తే డ్రాప్ట్‌ సిద్ధం చేయాలని ఆదేశించినట్టు చెప్పా రు.


ప్రైవేటు భూములకు ఇచ్చే రేటునే వారికీ ఇస్తామన్నారు. అత్యవసరమైతే ఇతర శాఖల మిగులు భూములు, అవసరంలేని భూములను తీసుకునేందుకు డ్రాప్ట్‌ను సిద్ధం చేస్తున్నామని, ఎక్కడా కూడా బలవంతంగా భూసేకరణ జరగడం లేదని కలెక్టర్‌ వివరించారు. భూములిచ్చేందుకు అంగీకరించని రైతులకు నచ్చజెప్పాలని, అవసరమైతే భూములిచ్చే రైతుల కుటుంబీకుల పేర్లను కాలనీకి పెట్టేలా అవగాహన కల్పించాలని తహశీల్దార్లకు సూచించినట్టు చెప్పారు. స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూములిచ్చేందుకు ముందుకు వచ్చిన సూరంపూడి రైతులను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో జేసీ లక్ష్మీశ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-23T06:30:39+05:30 IST