జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-27T05:33:33+05:30 IST

జిల్లా సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి : కలెక్టర్‌
జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవం

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 26 : జిల్లా సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఎదుట బుధవారం నిర్వహించిన 73వ గణతంత్ర దినోత్సవంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. సంక్షేమమే లక్ష్యంగా అన్ని శాఖలు నిబద్ధతతో పనిచేస్తూ ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలన్నారు. హరితహారంతో పర్యావరణ సమతుల్యత నెలకొంటుందని అన్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట మొక్కలను నాటి సంరక్షిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ లక్ష్యాలకు మేర మొ  క్కలు నాటినట్లు ఆయన తెలిపారు.   ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారు లు కృషి చేయాలన్నారు. జిల్లాలో కొవిడ్‌ నియంత్రణలోనే ఉందని, ఇప్పటికే జిల్లాలో 1,035 మెడికల్‌ బృం దాలు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నాయన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ నియంత్ర ణ కిట్లను అందజేస్తున్నామన్నారు. అంతకుముందు  జాతిపిత గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఎస్పీ మో హన్‌కుమార్‌, ఏవో శ్రీదేవి, డీపీవో యాదయ్య, సీపీవో వెంకటేశ్వర్లు, పీడీఐసీడీఎస్‌ జ్యోతిపద్మ, డీఎ్‌సవో విజయలక్ష్మి, సివిల్‌ సప్లయిస్‌ డీఎం రాంపతి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నాలుగు గంటల్లో 100 కిలోమీటర్లు...

సూర్యాపేట(కలెక్టరేట్‌) / అర్వపల్లి : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిపబ్లిక్‌ రన్‌ రైడ్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. 

రైడ్‌ ఫర్‌ రిపబ్లిక్‌ పేరుతో జిల్లా కేంద్రానికి చెందిన దేశగాని ఉప్పలయ్య, తవిటి సురేష్‌, మామిడి ఉపేందర్‌లు జాతీయ జెండాలను సైకిల్‌కు అమర్చుకొని 100 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో పూర్తి చేశారు. సూర్యాపేట నుంచి మొదలై అర్వపల్లి, తిరుమలగిరి వద్దకు వెళ్ళి తిరిగి అదే దారిలో సూర్యా      పేటకు చేరుకున్నారు. 

  




Updated Date - 2022-01-27T05:33:33+05:30 IST