Advertisement
Advertisement
Abn logo
Advertisement

రజకుల అభ్యున్నతికి కృషి

ఘట్‌కేసర్‌ రూరల్‌ : రజకుల అభ్యున్నతికి కృషిచేస్తానని ఎదులాబాద్‌ రజకసంఘం అధ్యక్షుడు అబ్బోల నాగేష్‌ అన్నారు. ఆదివారం ఎదులాబాద్‌లో రజక సంఘం ఆధ్యర్వంలో ఆ సంఘం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం కాలపరిమితి ముగియడంతో ఆదాయ-వ్యయాలపై చర్చించారు. రజకుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ మీటర్లు ఎంతమంది తీసుకున్నారు? ఏలా పనిచేస్తున్నాయానే విషయాలపై చర్చించారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. రజకసంఘం ప్రధాన కార్యదర్శి నడిమింటి సాయిలు, సభ్యులు సుక్కయ్య, నడిమింటి వెంకటేష్‌, ఎర్రోళ్ళ సత్యనారాయణ, మల్లేష్‌, గూడూరు సత్తయ్య, ఎర్రోళ్ళ కుమారస్వామి, కృష్ణ, శ్రీనివాస్‌, వార్డుసభ్యుడు శ్రీనివాస్‌, అంజయ్య తదితరులున్నారు.

Advertisement
Advertisement