జిల్లా ప్రగతికి కృషి

ABN , First Publish Date - 2021-10-17T05:29:35+05:30 IST

జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని చాంబర్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకం కారుణ్య నియామకాలపై చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిటబెట్టుకుంటానన్నారు.

జిల్లా ప్రగతికి కృషి
బాధ్యతలు స్వీకరిస్తున్న వెంకాయమ్మ

జడ్పీ చైర్‌పర్సన్‌ బాధ్యతలు స్వీకరించిన వెంకాయమ్మ

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 16 : జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని చాంబర్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకం కారుణ్య నియామకాలపై చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిటబెట్టుకుంటానన్నారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జడ్పీకి నూతన భవనం అవసరం ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు కరణం బలరాం, సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, నగర మేయర్‌ గంగాడ సుజాత, సీఈవో దేవానందరెడి,్డ ఇతర అధికారులు , జడ్పీటీసీ సభ్యులు  పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పరిషత్‌లో నిధుల లభ్యత, వివిధ పనుల పురోగతిపై అధికారులతో శనివారం చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తన చాంబరులో సమీక్ష నిర్వహించారు.  

 

Updated Date - 2021-10-17T05:29:35+05:30 IST