Abn logo
Sep 23 2021 @ 23:41PM

విద్యోన్నతికి కృషి చేయాలి

ఎమ్మెల్యేని సత్కరిస్తున్న ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్లు


ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం, సెప్టెంబరు 23 : పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్లు విద్యోన్నతికి నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అ న్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మండలంలోని పెద్దనా గుల వరానికి చెందిన ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్లు గురువారం ఎమ్మెల్యేను సత్కరిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికం కారణంగా విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నాడు-నేడు, అమ్మఒడి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో  జడ్పీ ఉన్నత పాఠశాల చైర్మన్‌ ఓర్సు వెంకటేశ్వర్లు(బుల్లి), వైస్‌చైర్మన్‌ కొండేటి రిబ్కా, ప్రాధమిక పాఠశాల ఎస్‌ ఎంసీ చైర్మన్‌ ఓర్సు సత్యనారాయణ, సర్పంచ్‌ ఓర్సు వీరబాబు, వైసీపీ నాయ కులు ఓర్సు సౌరయ్య, టి.బాలంకయ్య, ఓర్సు కొండలు(డీలర్‌), టి.గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.