Abn logo
Aug 14 2020 @ 04:51AM

వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేయాలి

బెల్లంపల్లి, ఆగస్టు 13: రైతులు, ప్రజలతో మమే కమై మార్కెట్‌ అభివృద్ధికి చైర్మన్‌, డైరెక్టర్లు కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ పిలుపు నిచ్చారు. గురువారం పద్మశాలి భవన్‌లో మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. పాలక మండలి చైర్మన్‌, డైరెక్టర్లు మార్కెట్‌ ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు.


బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంత్రి కేటీ ఆర్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో రూ.25 కోట్లు మంజూరు చేయను న్నారని తెలిపారు. నియోజకవర్గం లో లక్ష ఎకరాల సాగునీరు అం దించేందుకు త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొ న్నారు. అనంతరం పాలకవర్గ సభ్యుల ను శాలువాలతో సన్మానించారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌నేత, ఎం ఎల్‌సీ పురాణం సతీష్‌, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌, మా ర్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గడ్డం కళ్యాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్వేత, వైస్‌చైర్మన్‌ సుదర్శన్‌, జెడ్పీ వైస్‌చైర్మన్‌ సత్యనారా యణ పాల్గొన్నారు. 


మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌కు సన్మానం 

బెల్లంపల్లి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్ని కైన గడ్డం కళ్యాణిభీమాగౌడ్‌ను మాలమహానాడు కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. మార్కెట్‌ కమి టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుమ భాస్కర్‌, పట్టణాధ్య క్షుడురాజేష్‌, శ్రీనివాస్‌, శంకర్‌, పాల్గొన్నారు. 

Advertisement
Advertisement