జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-27T05:49:29+05:30 IST

జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
ఆసిఫాబాద్‌లో జెండా ఎగురవేస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు

ఆసిఫాబాద్‌, జనవరి 26: జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అవిష్కరించారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వరుణ్‌రెడ్డి, రాజేశం, ఎస్పీ సురేష్‌కుమార్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీ ఆడ్మిన్‌ వైవీఎస్‌ సుదీంధ్ర, అయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.   కాగా కొవిడ్‌ నిబంధనలను అనుసరించి జిల్లా పోలీసు కార్యాలయం, ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో బుధవారం గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆడ్మిన్‌ వైవీఎస్‌ సుదీంధ్ర, ఏఆర్‌ ఏఎస్పీ సురేష్‌, డీఎస్పీలు శ్రీనవాస్‌, కరుణాకర్‌, సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు. 

ఆసిఫాబాద్‌రూరల్‌: కోర్టు అవరణలో జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి నారయణబాబు, డీఈవో కార్యాలయంలో డీఈవో ఆశోక్‌, డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి మనోహర్‌, జిల్లా ఇంటర్‌ విద్య కార్యాలయంలో డీఐఈవో డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌, యాదవ సంఘ భవన్‌లో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, డీసీపీవో కార్యాలయంలో డీసీపీవో మహేష్‌ జెండా ఆవిష్కరించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ దత్తు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కార్యాలయంలో డీటీడీఓ మణెమ్మ, జిల్లా అటవిశాఖ కార్యాలయంలో డీఎఫ్‌ఓ శాంతరాంలు జాతీయజెండాను అవిష్కరించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేశారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: కాగజ్‌నగర్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా కాలనీలు, కార్యాలయాలు, కూడళ్లలో అధికారులు, నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. కాగజ్‌నగర్‌లోని గాంధీచౌక్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సర్‌సిల్క్‌ చౌరస్తా, ఎఎంసి కార్యాలయంతో పాటు పలు కాలనీల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జెండాను ఎగురు వేశారు. తెలంగాణా తల్లి చౌరస్తాలో మున్సిపల్‌ చైర్మెన్‌ సద్దాం హుస్సేన్‌,  మున్సిపల్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి కమీషనర్‌ బాపు, అలాగే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంతో పాటు, రాజీవ్‌ గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కోరళ్ల కిష్టారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. స్థానిక ఓల్డ్‌ కాలనీలో బీజేపి నాయకులు డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌ బాబు, బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ కొత్తపల్లి అనిత, స్థానిక టీడీపీ కార్యాలయంతో పాటు, ఎన్టీఆర్‌ చౌక్‌లో పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు గుళ్లపల్లి ఆనంద్‌ జెండా ఎగురవేవారు. ప్రజా కార్యాలయంలో సీనియర్‌ నాయకులు ఈర్ల విశ్వేశ్వర్‌ రావు, ఎంఐఎం నాయకులు ముబీన్‌, ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్స్‌, ప్రధానోపాధ్యాయులు, అధికారులు, నాయకులు జెండాను ఎగురువేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మెన్‌ కాసం శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ గిరీష్‌ కుమార్‌, నాయకులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

వాంకిడి: తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మధుకర్‌, జడ్పీటీసీ కార్యాలయంలో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌,  మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి. వ్యవసాయ కార్యాలయంలో ఏవో మిలింద్‌,  ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీవో రిబ్కా, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారి సతీష్‌, ఎంఆర్‌సీలో ఎంఈవో మనుకుమార్‌ జెండా ఎగురవేశారు.  ఎస్సీ వసతిగృహంలో హెచ్‌డబ్ల్యూవో తిరుపతి, ఎస్‌బీఐ బ్యాంకులో మేనేజర్‌ గోపాల్‌,   ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్‌ సంపత్‌కుమార్‌, గిరిజన బాలికల ఆశ్రమపాఠశాలలో హెచ్‌ఎం శ్రీనివాస్‌, సబ్‌ట్రేజరీ కార్యాలయంలో ఇన్‌చార్జి ఎస్టీఓ హబీబ్‌, బెండార డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ గోపాల్‌ పతాకాలను ఆవిష్కరించారు.    

Updated Date - 2022-01-27T05:49:29+05:30 IST