రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-19T04:52:59+05:30 IST

రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీ యంగా తగ్గించేందుకు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని డీజీపీ యం.మహిందర్‌రెడ్డి అధికారులకు సూచించారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పోలీసు అధికారులు

వీసీలో డీజీపీ మహిందర్‌ రెడ్డి

ఖమ్మంక్రైం, జనవరి18: రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీ యంగా తగ్గించేందుకు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని డీజీపీ యం.మహిందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించి, నివారణ చర్యలు చేపట్టేందుకు పోలీసు, పంచాయతీరాజ్‌, రవాణ, రెవెన్యూ, యన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు రోడ్స్‌ సేఫ్టి డీజీ సందీప్‌ శాండిల్య ఆధ్వర్యంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడారు. వేగ నియంత్రికలు, సూచిక బోర్డులు, జాతీయ రాష్ట్ర ఇతర ప్రధాన రహదారులకు వివిధ గ్రామాలు,ప్రాంతాల నుంచి అనుసంధానం చేసే రోడ్లపై అవసరమైన చోట్ల స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.   ప్రమాదాలపై ఎక్కడెక్కడ, ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణాల ప్రక్రియలో భాగంగా 48పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్లపై చర్చించారు. అనంతరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా రోడ్డు భద్రత కమిటి పర్యవేక్షణలో అవసరమైన చర్యలు తీసుకుం టున్నట్లు డీజీపీకు సీపీ విష్ణు వారియర్‌ వివరించారు. ఈ వీసీలో అడిషనల్‌ డీసీపీలు గౌస్‌ఆలం, సుబాష్‌ చంద్రబోస్‌, ఏసీపీలు బస్వారెడ్డి, వెంకటస్వామి, సీఐలు సత్యనారాయణ రెడ్డి, సురేష్‌, తుమ్మాగోపి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:52:59+05:30 IST