బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి

ABN , First Publish Date - 2021-12-07T05:35:45+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు కృషి చేస్తామని, వారి ఆశయాలను సాధించినప్పుడే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 65వ వర్ధంతి సంద్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే అంబేద్కర్‌చౌక్‌లో

బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి
ఆదిలాబాద్‌లోని బీసీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నివాళ్లు అర్పిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, అధికారులు

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు కృషి చేస్తామని, వారి ఆశయాలను సాధించినప్పుడే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 65వ వర్ధంతి సంద్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే అంబేద్కర్‌చౌక్‌లో బాబాసాహెబ్‌ 65వ వర్ధంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌, సుహాసినీరెడ్డి,  డీసీసీ అద్యక్షుడు సాజిద్‌ఖాన్‌, నాయకులతో పాటు వివిధసంఘాలైనా బీసీ, దళిత, మాల సంఘాల నాయకులు పెద్దఎత్తున హాజరై పూలమాలలు వేసి అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అలాగూ. బీసీ, దళిత, మాల, ఇతర సంఘాల నాయకులు సైతం అంబేద్కర్‌ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

ఇంద్రవెల్లి: అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర మహిళ కమీషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు మహ్మద్‌ అంజద్‌, భారతీయ బౌద్ద మహాసభ అధ్యక్షుడు సావంత్‌ లహుదాస్‌, కాంబ్లే ఉత్తం, తదితరులు పాల్గొన్నారు.  

బోథ్‌: మండల కేంద్రంలో సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్మాత 65వ వర్ధంతిని జరుపుకుని ఘన నివాళులర్పించారు. ఇందులో ఎంపీడీవో రాధ, సర్పంచ్‌లు సురేందర్‌యాదవ్‌, శ్రీదర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రకాష్‌రాథోడ్‌, ఎస్సై రాజు, తదితరులు పాల్గొన్నారు. 

ఉట్నూర్‌ రూరల్‌:  అంబేద్కర్‌ పుణ్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్‌లు వచ్చాయని జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య అన్నారు. సోమవారం స్థానికంగా అంబేద్కర్‌ చిత్ర పటానికి పూల మాల్చజీ వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు ఎస్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు భరత్‌ చౌహాన్‌, జిల్లా కాంగ్రెస్‌ వర్కింగ్‌ అధ్యక్షులు వెడ్మబోజ్జు, సర్పంచ్‌లు ఆత్రం రాహుల్‌, జాదవ్‌ సునిల్‌లు పాల్గొన్నారు. 

తాంసి:  అంబేద్కర్‌ వర్ధంతిని  మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో వివిధ సంఘాల నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. 

గుడిహత్నూర్‌: అంబేద్కర్‌ వర్ధంతిని మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో గుడిహత్నూర్‌లో అంబేద్కర్‌ మెమోరియల్‌ అసోసియేషన్‌, కాంగ్రెస్‌ పార్టీ, డీఎస్పీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

జైనథ్‌: అంబేద్కర్‌ వర్ధంతిని మండలంలోని లక్ష్మిపూర్‌, మాండగడ, గూడ, బోరజ్‌, గిమ్మా, తదితర గ్రామాలతో పాటు జైనథ్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందులో రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ ఎస్‌.లింగారెడ్డి,  రూరల్‌ సీఐ కె.మల్లేష్‌, సర్పంచ్‌ దేవన్న, తదితరులు పాల్గొన్నారు. 

తలమడుగు: మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్‌, వైస్‌ ఎంపీపీ దివ్యమాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 

సిరికొండ: మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో పార్టీ మండల అధ్యక్షుడు షేక్‌ ఇమామ్‌, పార్టీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ రంజాన్‌, తదితరులున్నారు.  

నేరడిగొండ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌  బీఆర్‌ అంబేద్కర్‌ 65వ వర్ధంతిని మండల కేంద్రంతో పాటు బుగ్గారాం, కుమారి, గుత్పల, వడూర్‌ తదితర గ్రామాలలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. 

Updated Date - 2021-12-07T05:35:45+05:30 IST