గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి

ABN , First Publish Date - 2021-06-19T06:41:00+05:30 IST

నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి
తెల్‌దేవరపల్లిలో ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

 ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌
చందంపేట, జూన 18 :
నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు  ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కోరుట్ల, తెల్‌దేవరపల్లి గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన శ్మశానవాటిక, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించి మాట్లాడారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలను  ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు ఏర్పుల గోవిందుయాదవ్‌ తండ్రి రామచంద్రయ్య మృతిచెందగా  ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెం ట ఎంపీపీ నున్సావత పార్వతి, జడ్పీటీసీ రమావత పవిత్ర, ఎంపీడీవో రాములునాయక్‌తో పాటు మాజీ ఎంపీపీ ముత్యాల సర్వ య్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కేతావత లక్ష ్మణ్‌నాయక్‌, గోసుల అనంతగిరి, మల్లే్‌షయాదవ్‌, మాధవరం శంకర్‌నాయక్‌, కేతావత శంకర్‌నాయక్‌, బోయపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, వాంకునావత బిక్కునాయక్‌, శవ్వ నారయ్యయాదవ్‌, బొడ్డుపల్లి కృష్ణ ఉన్నారు. 

Updated Date - 2021-06-19T06:41:00+05:30 IST