Abn logo
Oct 18 2021 @ 00:15AM

ఏజెన్సీలో టీడీపీకి పూర్వ వైభవానికి కృషి

సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణరావు


 టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మణరావు

చింతపల్లి, అక్టోబరు 17: ఏజెన్సీలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన స్వగృహంలో కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై గిరిజనుల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలమైన పోటీ ఇవ్వడంతోపాటు మోజార్టీ ఓట్లను సాధించిందన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ఏజెన్సీలో అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. ప్రధాన రహదారులు అధ్వానంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లి టీడీపీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. అంతకు ముందు తెలుగు యువత అరకు పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు పాంగి రాంబాబు, కార్యదర్శి బేరా సత్యనారాయణపడాల్‌లను ఆయన సన్మానించారు. ఈ కార్యకమ్రంలో టీడీపీ నాయకులు కిముడు లక్ష్మయ్య, సరమండ శ్రీధర్‌, మహేశ్‌, ఈశ్వరరావు, రమణ పాల్గొన్నారు.