Advertisement
Advertisement
Abn logo
Advertisement

దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి

 అదనపు కలె క్టర్‌ రాహుల్‌శర్మ

నల్లగొండ టౌన్‌, డిసెంబరు 3: దివ్యాంగుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు కృషిచేయాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేడ్కర్‌ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం 2016లో ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతీ మూడు నెలలకోసారి అధికారులు సమీక్ష నిర్వహించాలన్నారు. దివ్యాంగులకు పరికరాలు ఆన్‌లైన్‌ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి జి.వేణు మాట్లాడుతూ, దివ్యాంగులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. ఐసీడీఎస్‌ పీడీ సుభద్ర మాట్లాడుతూ, దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని, స్వయం ఉపాధి పఽథకాలు అమలుచేస్తున్నామన్నారు. సహాయ పరికరాలు అవసరం ఉన్నవారు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కాళిందిని, డీసీహెచ్‌ఎ్‌స మాతృనాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అరుంధతి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చొల్లేటి ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.


ఉపకార వేతనాల దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేయాలి

జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా ఆన్‌లైన్‌ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి దరఖాస్తులను సంబంధిత సంక్షేమ శాఖల అధికారులకు పంపాలని సూచించారు. ధ్రువీకరణ పత్రాలకు మీ-సేవా కేంద్రం నిర్వాహకులు రూ.45 కంటే ఎక్కువ తీసుకోవద్దని, ఎవరైనా అధికంగా వసూలు చేస్తే కాల్‌ సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో సంక్షేమశాఖల అధికారులు రాజ్‌కుమార్‌, కృష్ణవేణి, సల్మాభానూ, వెంకటయ్య, డీఈవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement