Abn logo
Sep 24 2021 @ 00:42AM

సమగ్ర విచారణతో నేరస్థులకు శిక్ష పడేలా కృషి

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- మహిళల భద్రతకు పటిష్ట చర్యలు 

- సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి 

- రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

జ్యోతినగర్‌, సెప్టెంబరు 23 : సమగ్ర, నాణ్యమైన విచారణ ద్వారా నేరస్థులకు శిక్షలు పడేలా పోలీసు అధికారులు కృషి చేయాలని రామగుండం సీపీ ఎస్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ట్రయల్‌ కేసులకు సంబం ధించి అధిక శాతం కన్విక్షన్‌ నమోదు చేసేలా పని చేయాలని సూచించారు. గురువారం ఎన్టీపీసీ ఈడీ సీ మిలీనియం హాలు కమిషనరేట్‌ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులతో సీపీ సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమి షనర్‌ మాట్లాడుతూ కోర్టు విచారణలో ఉన్న కేసుల విషయంలో న్యాయశాఖ అధికారులతో సమన్వయం తో పనిచేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. దోషుల కు శిక్షలు పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగు తుందన్నారు. పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యే ప్రతికేసు వివరాలను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. పోక్సో కేసులకు సంబంధించి పక్కా ఆధారాలు కోర్టు ముం దుంచి, త్వరితగతిన విచారణ పూర్తి చేసి దోషులకు పడేలా కృషి చేయాలని ఆయన సూచించారు.

పెరిగిన సైబర్‌ నేరాలు..

ఇటీవల సైబర్‌ నేరాలు పెరిగాయని, కొత్త పద్ధతు ల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతూ అమాయక ప్రజల్ని నేరగాళ్లు దోచుకుంటున్నారని సీపీ పేర్కొన్నారు. సైబ ర్‌నేరగాళ్ల బారినపడకుండా ప్రజలను చైతన్యపర్చాల ని, వారికి నేరాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్య త పోలీసు అధికారులపై ఉందన్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా తరచూ అవగాహన సదస్సులు నిర్వహిం చాలని సూచించారు. సైబర్‌క్రైం బారినపడిన ప్రజలు టోల్‌ఫ్రీ నెంబరు 155260, డయల్‌ 100, 112లకు ఫోను ద్వారా ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌ కేసుల సత్వ ర పరిష్కారానికి ఐవో అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ని రంతర విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాలపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్లూ కోల్ట్స్‌, పెట్రోలింగ్‌, బీట్‌ సిబ్బంది ప్రజలకు అందుబా టులో ఉండి నేరాల నియంత్రణకు కృషి చేయాలని, ఈ విషయంలో నిత్యం కిందిస్థాయి సిబ్బందిని అధి కారులు అప్రమత్తం చేయాలని సూచించారు. పీడీ ఎస్‌ రైస్‌ అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్‌, మట్కా, గుట్కా, బెట్టింగ్‌ తదితర అసాంఘిక కార్యకలాపాల కు పాల్పడేవారిపై గట్టి నిఘా పెట్టి వారిపై చట్టప్ర కారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 5ఎస్‌ అమ లులో భాగంగా పోలీస్‌స్టేషన్లను పరిశుభ్రంగా ఉం చుకోవాలని, అన్ని రకాల కేసుల ఫైళ్లను క్రమపద్ధతి లో అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. పో లీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహ రించి, వారికి న్యాయం చేస్తామని భరోసాను కల్పించే లా పోలీసులు వ్యవహరించాలని కోరారు. ట్రాఫిక్‌ ని యమాలు అతిక్రమించే వారిపై జరిమానాలు విధిం చాలని, పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేయాలన్నారు. మహిళలు, బాలికల రక్షణకు సంబంధించి పటిష్టమై న చర్యలు తీసుకోవాలని, షీటీంలద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని, నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రతిచోట సీసీ కెమెరాలను ఏర్పా టు చేసేలా ప్రజలను సన్నద్ధం చేసేలా అధికారులు చొరవచూపాలన్నారు. చోరీ కేసులను త్వరగా పరిష్క రించి చోరీ సొమ్మును రికవరీ చేసి భాదితులకు న్యా యం జరిగేలా చూడాలని సీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూ చించారు. సమావేశంలో పెద్దపల్లి, మంచిర్యాల డీసీ పీలు రవిందర్‌, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఓఎస్డీ శరత్‌చం ద్ర పవర్‌, డీసీపీ అడ్మిన్‌ అశోక్‌కుమార్‌, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్‌, పెద్దపల్లి ఏసీపీలు అఖిల్‌ మహా జన్‌, రెహమాన్‌, నరేందర్‌, సారంగపాణి, ఎస్‌బీ, సీసీ ఎస్‌, ఏఆర్‌ ఏసీపీలు నారాయణ, రమణబాబు, సుం దర్‌రావు, మల్లికార్జున్‌, ఏవో నాగమణి, సీఐ, ఎస్‌ఐ లు పాల్గొన్నారు.