‘ఖాందేవ్‌’ సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-01-19T06:26:30+05:30 IST

నార్నూర్‌ మండల కేంద్రంలో వెలసిన ఖాందేవ్‌ ఆల య సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం నార్నూర్‌లో ప్రారంభమైన తొడసం వంశీయుల ఆదివాసీ జాతర ఖాందేవ్‌ జాతరలో నిర్వహించిన ప్రజాదర్భార్‌కు

‘ఖాందేవ్‌’ సమస్యల పరిష్కారానికి కృషి
ఖాందేవ్‌ సన్నిధిలో నువ్వుల నూనె తాగుతున్న ఆదివాసీ మహిళ మడావి యేత్మాబాయి

ప్రజాదర్భార్‌లో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 

నార్మూర్‌లో ప్రారంభమైన ఖాందేవ్‌ జాతర 

నువ్వుల నూనె తాగిన తొడసం ఆడపడుచు

ఉట్నూర్‌, జనవరి 18: నార్నూర్‌ మండల కేంద్రంలో వెలసిన ఖాందేవ్‌ ఆల య సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం నార్నూర్‌లో ప్రారంభమైన తొడసం వంశీయుల ఆదివాసీ జాతర ఖాందేవ్‌ జాతరలో నిర్వహించిన ప్రజాదర్భార్‌కు ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. ప్రతి యేటా జాతర సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ఆదివాసీ గిరిజన భక్తులతో పాటు ఉమ్మడి జిల్లాలోని గిరిజనులు సమస్యలు ఎదుర్కొకుండా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సం ప్రదాయాలు భావితరాలకు అందించాలన్నారు. జాతరకు వస్తున్న భక్తులందరు ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అన్నారు.  

ఖాందేవ్‌కు ప్రజాప్రతినిధుల పూజలు 

నార్నూర్‌లో ప్రారంభమైన ఖాందేవ్‌ జాతరకు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, ఆసిఫాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావులు హాజరై ఖాందేవ్‌కు ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రతి యేటా పుష్యమి  పౌర్ణమి సందర్భంగా తొడసం వంశస్తులు ప్రారంభిస్తున్న  జాతరలో ఖాందేవ్‌కు పూజలు చేయడం వల్ల ప్రజలందరు సుఖసంతోషాలతో ఉంటారన్నారు. 

రెండు కిలోల నూనె తాగిన యేత్మాబాయి

నార్నూర్‌ మండలంలోని చిత్తగూడకు చెందిన తొడసం జంగుబాయిసోనేరావు దంపతుల కూతురు మడావి యేత్మాబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి తొడసం వంశీయుల ఆనవాయితీని కొనసాగించింది. మూడేళ్లకోసారి ఒకరి వంతుగా గత రెండేళ్లపాటు నువ్వుల నూనే తాగిన యేత్మాబాయి మూడోసారి మంగళవారం ఖాందేవ్‌ ఆలయం వద్ద నువ్వుల నూనె తాగింది. దీనివల్ల తొడసం వంశీయులకు అంతా మేలు జరుగుతుందని నమ్మకం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో గిరిజనులు తమ ఆచారాలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌ కనక లక్కెరావు, ఆలయ కమిటీ చైర్మన్‌ రూప్‌దేవ్‌తో పాటు సర్పంచ్‌ గజానంద్‌నాయక్‌, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, ఎంపీటీసీ పరమేశ్వర్‌, త దితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-19T06:26:30+05:30 IST