బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-01-24T05:57:31+05:30 IST

బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి
మంత్రి జగదీ్‌షరెడ్డిని సన్మానిస్తున్న బిల్డర్‌ అసోసియేషన్‌ నాయకులు

మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 23: బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా బిల్డర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గసభ్యులు మంత్రిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిల్డర్స్‌ ఎదుర్కొంటున్న సమస్య లు తన దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, సభ్యులు వరిపెల్లి శంక ర్‌, కొడిదల భిక్షపతి, ఖమ్మంపాటి జానయ్య, చంద్రారెడ్డి, మహిపాల్‌రెడ్డి, బాబురావు, రాము, రాంబాబు, శంకర్‌, సలీం, హరీష్‌, రమాకిరణ్‌, షాహిద్‌, తదితరులు పాల్గొన్నారు. 


చిన్నారికి అండ

కొవిడ్‌ బారినపడి ఎనిమిది నెలలుగా ఇబ్బందులుపడుతున్న ఓ చిన్నారికి మంత్రి జగదీ్‌షరెడ్డి అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డకు చెందిన గోపగాని అశోక్‌, శ్రీవిద్య కుమార్తె చైత్ర ఎనిమిది నెలల క్రితం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించడంతో ఊపిరితిత్తులు, నరాల సమస్య ఏర్పడింది. ప్రస్తుతం చిన్నారి ఆక్సిజన్‌తో నెట్టుకొస్తోంది. కాగా, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా ఈ వార్డులో పర్యటించిన మంత్రి, స్థానికుల ద్వారా చిన్నారి విషయాన్ని తెలుసుకొని పరామర్శించారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మురళీధర్‌రెడ్డితో మాట్లాడి మెడికల్‌ కళాశాల వైద్య బృందంతో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మంచానికే పరిమితమైన జిల్లా కేంద్రంలోని చర్చికాంపౌండ్‌కు చెందిన మొండికత్తి వినిత్‌కు శస్త్రచికిత్స ఖర్చులు, వైద్య బాధ్యతలు మంత్రి జగదీ్‌షరెడ్డి తీసుకున్నారు.


సంప్రదాయాలను కాపాడుకోవాలి

సూర్యాపేట కల్చరల్‌: మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దిగుమతి హా మాలీ యూనియన్‌ కార్యాలయంలో ఉప్పలమ్మతల్లి పండుగ సందర్భంగా నిర్వహించిన పూజల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ జానయ్యయాదవ్‌, జడ్పీటీసీ భిక్షం, వెంకటేశ్వర్లు, పెద్దగట్టు ఆలయ చైర్మన్‌ కోడి సైదులు, పోలెబోయిన నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పురాతన దేవాలయం రాపోలుగుడి అభివృద్ధిపై పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డితో చర్చించారు.


ఉర్సుకు రండి

పాలకవీడు: జాన్‌పహాడ్‌ దర్గాలో ఈ నెల 27 నుంచి నిర్వహించే ఉర్సుకు రావాల్సిందిగా మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని దర్గా ముతవలి జాని ఆదివారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Updated Date - 2022-01-24T05:57:31+05:30 IST