ఎంఆర్‌ఎఫ్ కార్మిక పోరాట సమితి కార్మిక గర్జనలో మాట్లాడుతున్న విమలక్క
కళామండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క
సదాశివపేట, జనవరి 26: ఎంఆర్‌ఎఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కళామండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క అన్నారు. సదాశివపేట బాంబే టాకీసు ఆవరణలో ఎంఆర్‌ఎఫ్ కార్మిక పోరాట సమితి వ్యవస్థాపకుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం కార్మిక గర్జన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన విమలక్క మాట్లాడుతూ.. జరగబోయే ఎన్నికల్లో కార్మిక పోరాట సమితి ప్రెసిడెంట్‌గా కొత్తగొల్ల చంద్రశేఖర్‌ను నియమించాలని తీర్మానించారు. కార్యక్రమంలో ప్రజాగాయకుడు, కవి నేర్నాల కిషోర్, తెలంగాణ జేఏసీ చైర్మన్ వై.అశోక్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మల్లేశం, యూనియన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.