Abn logo
Jan 16 2021 @ 00:22AM

గుడ్డు వెరీగుడ్‌!

పోషకాలు, శక్తి నిండిన గుడ్డు పౌష్ఠికాహారమని, ఆరోగ్యానికి మంచిదని తెలుసు. చలికాలంలో గుడ్లు తింటే శరీరం వెచ్చగా ఉండడమే కాదు ఇతర లాభాలు ఉన్నాయి అంటున్నారు 

పోషకాహార నిపుణులు. వారు ఏం చెబుతున్నారంటే...

  • చలికాలంలో రోజుకు ఒక గుడ్డు తింటే ఏడు గ్రాముల నాణ్యమైన ప్రొటీన్‌తో పాటు ఐదు గ్రాముల ఫ్యాట్‌ శరీరానికి అందుతుంది. హానికర క్రిముల నుంచి శరీరానికి రక్షణ అందించే యాంటీ బాడీల తయారీకి ప్రొటీన్‌ ఎంతో అవసరం. 
  • ఈ సీజన్‌లో కణాల ఉత్పత్తికి కొవ్వు అవసరం. అది గుడ్డులో పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు గుడ్డులోని జింక్‌ ఈ కాలంలో ఎక్కువగా వేధించే జలుబును నివారిస్తుంది. 
  • గుడ్డు తింటే చలికాలంలో విటమిన్‌ డి లోపం ఏర్పడదు. రోజూ అవసరమైన డి విటమిన్‌లో పది శాతం గడ్డులోనే లభిస్తుంది. 
  • రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడే బి6, బి 12 విటమిన్లు గుడ్డులో లభిస్తాయి. 
  • ఉడకబెట్టిన గుడ్లు తినేవాళ్లకు మీల్‌ ప్లాన్‌ ఉంటుంది. దాని ప్రకారం రోజుకు ఆరు వరకూ ఉడికించిన గుడ్లు తినొచ్చు. అయితే పరిమితికి మించి గుడ్లు తింటే శరీరంలో కొవ్వు చేరే అవకాశం ఉందంటున్నారు ఆహారనిపుణులు.