ఎగ్‌ప్లాంట్‌ స్టీక్స్‌

ABN , First Publish Date - 2021-01-03T17:57:07+05:30 IST

వంకాయలు - నాలుగు, కాబూళి సెనగలు - అరకప్పు, క్యాప్సికం - మూడు(ఎరుపు, పసుపు, ఆకుపచ్చ), జున్ను - అరకప్పు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత

ఎగ్‌ప్లాంట్‌ స్టీక్స్‌

కావలసినవి: వంకాయలు - నాలుగు, కాబూళి సెనగలు - అరకప్పు, క్యాప్సికం - మూడు(ఎరుపు, పసుపు, ఆకుపచ్చ), జున్ను - అరకప్పు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, టొమాటో కెచప్‌ - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం: వంకాయలను పొడవు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. కాబూళి సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని, మెత్తగా అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. క్యాప్పికంను కట్‌ చేసి కాస్త వేగించి పక్కన పెట్టాలి. ఒక ప్లేట్‌లో ఉప్పు, మిరియాల పొడి వేసి వంకాయ ముక్కలు రబ్‌ చేసి పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గ్రిల్‌ పాన్‌ను వేడి చేసి కొద్దిగా నూనె చిలకరించాలి. తరువాత వంకాయ ముక్కలను రెండు వైపులా కాల్చాలి. ఇప్పుడు ఆ ముక్కలకు టోమాటో సాస్‌ రాసి, సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఉడికించిన కాబూళి సెనగలు, క్యాప్సికం ముక్కలు సమంగా పరచాలి. కొద్దిగా సాస్‌ పోయాలి. జున్ను, కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి. వీటిని చల్లగా లేదా వేడిగా సర్వ్‌ చేసుకోవచ్చు.


Updated Date - 2021-01-03T17:57:07+05:30 IST