ఈజీఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-01-24T05:59:20+05:30 IST

ఈజీఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలి

ఈజీఎస్‌ రిజర్వేషన్‌  అమలు చేయాలి

ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామరావు

కాటారం, జనవరి 23:  ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోరాడి రామారావు అన్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాటారం మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమాఖ్య రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లో భాగంగా  ఆదాయ పరిమితిని సరళతరం చేస్తూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు నేటికీ అమలు కావడం లేదని విమర్శిం చారు. అగ్రవర్ణ పేదలకు రూ.8 లక్షల ఆదాయ పరిమితిని సులభతరం చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోగా ఆ ఉత్తర్వులు క్షేత్రస్థాయికి అందక తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఇన్‌కం సర్టిఫికెట్లు జారీ చేయడం లేద న్నారు. ఇప్పటికైనా ఈడబ్ల్యూఎస్‌ ఆదాయ పరిమితిని సరళీకృతం చేసిన ఉత్తర్వులను క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. త్వరలో సుమారు 65వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్‌ కోసం అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల ఆందోళనకు కారణమైన జీవో 317ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెడ్డి, వైశ్య కులాల ఫెడరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.  ఈ సమావేశంలో సమాఖ్య రాష్ట్ర, జిల్లా నేతలు కరుణాకర్‌రావు, విజయారెడ్డి, అనంతుల రమే్‌షబాబు, మహేష్‌ రవీందర్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి, సామ బాలచందర్‌, శ్రీనివాస్‌, పుల్లారెడ్డి, ప్రభాకర్‌రావు, సూర్యనారాయణ, అశోక్‌, రవీందర్‌, ప్రవీణ్‌, శ్రీనివా్‌సరెడ్డి, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-24T05:59:20+05:30 IST