Abn logo
Jan 2 2021 @ 18:15PM

పాములతో మసాజ్.. నెటిజన్లను షేక్ చేస్తున్న దృశ్యాలు!

ఇంటర్నెట్ డెస్క్: పాము ప్రస్తావన వస్తే చాలు ఎవరైనా ఉలిక్కిపడాల్సిందే..అలాంటి పాములతో మాసాజ్‌లు చేయిస్తానంటో ఓ స్పా యాజమాన్యం. ఇందుకు సంబంధించి ఆఫర్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇజిప్ట్ రాజధాని కైరోకు చెందిన ఓ స్పా ఈ వింత ఆఫర్‌ను ప్రకటించింది. నచ్చిన పాముల్ని ఎంచుకోండంటూ కస్టమర్లకు ఓ లిస్టు కూడా ఇస్తోంది. ఇక ఈ స్పా యాజమాన్యం చూపెడుతున్న పాములు విషపూరితమైనవేమీ కావు. 

ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింటో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ షాకైపోతున్నారు. గుండె జబ్బులు గట్రా ఏమైనా ఉంటే..ఈ ఆఫర్ జోలికి పోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మసాజ్ దాదాపు 30 నిమిషాల పాటు జరుగుతుంది. స్పా సిబ్బంది తొలుత కస్టమర్ శరీరాన్ని వివిధ రకాల తైలాలు రాసీ ఆ తరువాత పాములు శరీరంపైకి విడిపెడతారట. అవి ఒళ్లంగా పాకూతూ ఉంటే మనసంతా ప్రశాంతతో నిండిపోతుందని సిబ్బంది చెబుతున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికే అనేక మంది ఈ మసాజ్ చేయించుకున్నారట. మొదట భయమేసినా ధైర్యం చేసి రంగంలోకి దిగామని..మసాజ్ ద్వారా మానసిక ప్రశాంతత లభించిందని కొందరు చెప్పుకొచ్చారు. 

Advertisement
Advertisement