ఒక్క వీడియో వల్ల ఆమె ఉద్యోగం పోయింది.. భర్త విడాకులు ఇచ్చేశాడు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ABN , First Publish Date - 2022-01-13T20:32:27+05:30 IST

ఆమె సహచర ఉద్యోగులతో సరదాగా చేసిన పని ఆమె కొంప ముంచింది.. ఉద్యోగం పోగొట్టుకుంది..

ఒక్క వీడియో వల్ల ఆమె ఉద్యోగం పోయింది.. భర్త విడాకులు ఇచ్చేశాడు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఆమె సహచర ఉద్యోగులతో సరదాగా చేసిన పని ఆమె కొంప ముంచింది.. ఉద్యోగం పోగొట్టుకుంది.. భర్తకు దూరమైంది.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.. ఇంతకీ ఆమె చేసిన పని ఏంటంటే.. తన సహచర మగ ఉద్యోగులతో కలిసి బెల్లీ డ్యాన్స్ చేయడం. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె ఈజిప్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 


ఈజిప్టులోని నైలు డెల్టా ప్రాంతంలో ఖలేద్-ఇబ్-అల్-వాలిద్ ప్రైమరీ స్కూలులో అయా యూసఫ్ అనే మహిళ అరబిక్ టీచర్‌గా పనిచేస్తోంది. ఇటీవల నైలు నది మీద క్రూయిజ్ షిప్‌లో జరిగిన పార్టీలో ఆమె తన సహచర మగ ఉద్యోగులతో కలిసి బెల్లీ డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆమె డ్రెస్సింగ్ సవ్యంగానే ఉన్నా, డ్యాన్స్ మూమెంట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  


నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. దీంతో స్కూలు యాజమాన్యం యూసఫ్‌ను విధుల నుంచి తప్పించింది. అంతేకాదు భర్త కూడా ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. `నైలు నది మీద బోటులో నేను గడిపిన పది నిమిషాలు నా జీవితాన్ని మార్చేశాయ`ని ఆమె విషాదంలో మునిగిపోయింది. కాగా, ఆమెకు ఈజిప్టు మహిళా హక్కుల సంస్థ అండగా నిలిచింది. ఆమె చేయాలనుకుంటే తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామని చెప్పింది. అలాగే స్కూలు యాజమాన్యంపై యూసఫ్ న్యాయపోరాటం చేయాలనుకుంటే తమ మద్దతు ఉంటుందని తెలిపింది. 


Updated Date - 2022-01-13T20:32:27+05:30 IST