సౌదీలో రేపే ఈద్-ఉల్-ఫితర్

ABN , First Publish Date - 2020-05-23T16:46:12+05:30 IST

సౌదీ అరేబియాలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను మే 24వ తేదీన జరపాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు.

సౌదీలో రేపే ఈద్-ఉల్-ఫితర్

రియాధ్‌: సౌదీ అరేబియాలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను మే 24వ తేదీన జరపాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. గల్ఫ్ దేశాల్లో శుక్రవారం చంద్రుడు కనిపించ లేదు. శనివారం నెలవంక కనిపించే అవకాశముండటంతో మే 24న ఈద్-ఉల్-ఫితర్ జరపాలని సౌదీ అధికారులు నిర్ణయించారు. ప‌విత్ర‌ రంజాన్ మాసం ఉపవాసాలు ఈ పండుగతో ముగియనున్నాయి. కాగా, ప్ర‌స్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈద్ ప్రార్థనలతోపాటు పండుగ వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని ఈ సంద‌ర్భంగా ముస్లిం మతపెద్దలు సూచించారు.


అలాగే బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జ‌న స‌మూహాల‌కు అనుమతి లేద‌ని, సామాజిక దూరం పాటిస్తూ ఇళ్ల‌లోనే పండుగ జ‌రుపుకోవాల‌ని అధికారులు సూచించారు. సౌదీతో పాటు యూఈఏ, ఈజిప్ట్‌, కువైట్‌, బ‌హ్రెయిన్‌, జోర్డాన్‌లో కూడా శ‌నివార‌మే ఈద్-ఉల్-ఫితర్ జ‌రుపుకోవాల‌ని ఆయా దేశాల ముస్లిం మ‌త‌పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఇక సౌదీలో స్వైర విహారం చేస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే 67వేల‌కు పైగా మందికి సోకింది. 364 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. 

Updated Date - 2020-05-23T16:46:12+05:30 IST